బర్త్‌డే బాయ్‌పై ఫోమ్.. ముఖానికి మంటలు

న్యూఢిల్లీ: బర్త్‌డే బాయ్‌పై అతడి స్నేహితులు స్నో ఫోమ్ చల్లారు. అతడు కేక్ కట్ చేయబోగా వెలుగుతున్న క్యాండిల్ కారణంగా ముఖం మీద ఉన్న ఫోమ్‌కు మంటలు అంటుకున్నాయి. దీంతో కంగారుగా అతడు పక్కకు పరుగెత్తాడు. భయాందోళనకు గురైన స్నేహితులు అతడికి సహాయం చేసేందుకు ప్రయత్నించారు. ఈ ఘటన వల్ల ఆ వ్యక్తి పుట్టిన రోజు వేడుక విషాదంగా మారింది.
ఒళ్లు జలదరించే ఈ వీడియోను పునేట్రావెల్క్స్ అనే ఇన్స్టాగ్రామ్ పేజీలో పోస్ట్ చేశారు. పార్టీల సందర్భంగా చల్లే ఫోమ్స్పట్ల జాగ్రత్తగా ఉండాలని అందులో పేర్కొన్నారు. ‘పార్టీలలో చల్లే ఫోమ్స్లో రసాయనాలు ఉంటాయి. అవి కంటికి మంచివి కాదు. కండ్ల ఇరిటేషన్ కలిగిస్తాయి. అలాగే స్నో ఫోమ్స్‌కు మండే గుణం ఉంటుంది. వాటి బాటిల్స్‌పై ఈ హెచ్చరికతో కూడిన సంకేతాలు కూడా ఉంటాయి. మంటలపై చల్లవద్దని అందులో ఉంటుంది. అయినప్పటికీ పుట్టిన రోజు వంటి వేడుకల్లో క్యాండిల్ మండుతుండగా ఫోమ్స్‌ను స్ప్రె చేస్తుంటారు. ఫలితంగా ఇలాంటి ప్రమాదాలు జరుగుతుంటాయి’ అని అందులో హెచ్చరించారు.
మరోవైపు ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యింది. నెటిజన్లు దీనిపై భిన్నంగా స్పందించారు. ఆ బర్త్‌డే బాయ్‌కు పెద్ద ప్రమాదం జరుగలేదని, చిన్నపాటి కాలిన గాయాలయ్యాయని కొందరు పేర్కొన్నారు.
https://www.instagram.com/p/CMJZvxmjkeW/?utm_source=ig_web_copy_link
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Delhi Police | దీప్కేకు అతడి నానమ్మ మరణవార్తను వెంటనే తెలియజేశాం : ఢిల్లీ పోలీసులు
BRS Councilors | మున్సిపల్ కమిషనర్ తీరుపై కలెక్టర్‌కు ఫిర్యాదు చేస్తాం : బీఆర్ఎస్ కౌన్సిలర్స్
Watch: పార్టీ సమావేశంలో కాంగ్రెస్ వర్గాల మధ్య ఘర్షణ.. పూలగుత్తులు, బూట్లు విసురుకున్న వైనం
IND vs WI | భారత్‌తో మూడో టీ20.. టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న వెస్టిండీస్
Pakistan | పాకిస్తాన్, ఖైబర్ పఖ్తుంఖ్వాలో ఎమర్జెన్సీ.. పీటీఐ ప్రభుత్వం రద్దు.. సీఎం అరెస్ట్
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

