Tejashwi Yadav : బీహార్ రాష్ట్రం అవినీతితోపాటు అన్నిట్లో నెంబర్ వన్‌గా ఉన్నదని ఆర్జేడీ పార్టీ అగ్రనేత, బీహార్ మాజీ ఉపముఖ్యమంత్రి తేజస్వి యాదవ్ అన్నారు. బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్‌కు ప్రభుత్వాన్ని నడిపే సత్తా లేదని, బీజేపీ నేతలకు అధికారం తప్ప ప్రజల సంక్షేమం పట్టదని విమర్శించారు. కేంద్రంలో, రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వమే ఉన్నా బీహార్‌కు వాళ్లు చేసిందేమీ లేదని మండిపడ్డారు.
‘నిరుద్యోగం, పేదరికం, అధిక ధరలు, అవినీతి అన్నిట్లోనూ బీహార్ నెంబర్ వన్ రాష్ట్రం. నేరాల్లోనూ బీహార్ నెంబర్ వన్ రాష్ట్రమే. కేంద్రంలో, రాష్ట్రంలో అధికారంలో ఉన్నా బీహార్ కోసం బీజేపీ చేసిందేమీ లేదు. బీజేపీ ఎప్పుడూ అధికారం కోసం పాకులాడుతుంది. 17 ఏండ్లుగా బీహార్‌లో డబుల్ ఇంజిన్ ప్రభుత్వమే ఉన్నా రాష్ట్రానికి వాళ్లు చేసిందేమీ లేదు’ అని తేజస్వి యాదవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
#WATCH | LoP in Bihar Assembly and RJD leader Tejashwi Yadav says, “Bihar is number one in unemployment, poverty, inflation and in corruption…Bihar is number one in crime also…Despite having a government at the Centre and State, nothing has been corrected…BJP people are… pic.twitter.com/sXtvOJL1PL
— ANI (@ANI) August 24, 2024