డిప్యూటీ కలెక్టర్‌ను అసభ్యంగా దూషించిన సీనియర్ ఐఏఎస్ అధికారి.. వీడియో వైరల్
ఆ రాష్ట్ర ఎక్సైజ్ ప్రిన్సిపల్ సెక్రటరీ కేకే పాఠక్ ఒక సమావేశంలో జూనియర్ అధికారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నగర ప్రజలు ట్రాఫిక్ నిబంధనలు పాటించకపోవడంపై మండిపడ్డారు. ఈ సందర్భంగా డిప్యూటీ కలెక్టర్‌ను ఆయన అసభ్య పదాలతో దూషించారు.
పాట్నా: డిప్యూటీ కలెక్టర్‌గా ఉన్న జూనియర్ అధికారిని ఒక సీనియర్ ఐఏఎస్ అధికారి అసభ్యంగా దూషించారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో ఆయనపై చర్యలు తీసుకోవాలని ఐఏఎస్ అధికారుల సంఘం డిమాండ్ చేసింది. బీహార్‌లో ఈ సంఘటన జరిగింది. ఆ రాష్ట్ర ఎక్సైజ్ ప్రిన్సిపల్ సెక్రటరీ కేకే పాఠక్ ఒక సమావేశంలో జూనియర్ అధికారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నగర ప్రజలు ట్రాఫిక్ నిబంధనలు పాటించకపోవడంపై మండిపడ్డారు. ఈ సందర్భంగా డిప్యూటీ కలెక్టర్‌ను ఆయన అసభ్య పదాలతో దూషించారు. ‘చెన్నైలో ప్రజలు రూల్స్ పాటిస్తారు. ఇక్కడ ఎవరైనా ట్రాఫిక్ రూల్స్ పాటించడం చూశారా? రెడ్ లైట్ ఉన్నా హారన్ కొడుతూనే ఉంటారు. ఇది చూడలేదా?.. ఇక్కడి ప్రజలు అలానే ఉంటారు. డిప్యూటీ కలెక్టర్ పరిస్థితి ఇదీ’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ అంశంపై ఈ నెల 13న చర్చిద్దామంటూ లేచి వెళ్లిపోయారు.
కాగా, ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో జూనియర్ అధికారి అయిన డిప్యూటీ కలెక్టర్‌ను దూషించిన పాఠక్‌పై చర్యలు తీసుకోవాలని బీహార్ ఐఏఎస్ అధికారుల సంఘం డిమాండ్ చేసింది. ఈ నేపథ్యంలో బీహార్ ఎక్సైజ్ మంత్రి సునీల్ కుమార్ దీనిపై స్పందించారు. ఆయనపై తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.
#WATCH | Bihar Excise Principal Secretary KK Pathak was caught on camera abusing his junior officers.
(Source: viral video)
Note: Abusive language pic.twitter.com/VvxzeLAVvA
— ANI (@ANI) February 2, 2023
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

