న్యూఢిల్లీ: ఆన్లైన్ ద్వారా ‘ఆధార్’ కార్డులో మార్పులకు సంబంధించిన ప్రక్రియ ఇకపై మరింత వేగవంతం కాబోతున్నది. అన్ని రకాల అప్డేట్స్, మార్పులకు వీలు కల్పించబోతున్నట్టు తెలిసింది.
ఇందుకోసం సరికొత్త మొబైల్ అప్లికేషన్‌ను ‘భారత విశిష్ట ప్రాధికారిక సంస్థ’ (ఉడాయ్) తీసుకురాబోతున్నది. క్యూఆర్ కోడ్ కార్యాచరణతో సురక్షితమైన డిజిటల్ ఆధార్‌ను పరిచయం చేయబోతున్నది. సెల్ఫ్ సర్వీస్ అప్డేట్ పోర్టల్‌ను ప్రవేశపెట్టబోతున్నట్టు సంబంధిత వర్గాలు శనివారం వెల్లడించాయి.