Car Pileup | యూపీలో ఘోర ప్రమాదం.. పొగమంచు కారణంగా ఢీకొన్న 10 వాహనాలు
Car Pileup | ఉత్తరప్రదేశ్‌లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. దేశరాజధాని ఢిల్లీకి (Delhi) సుమారు 86 కిలోమీటర్ల దూరంలో ఉన్న హాపూర్‌లోని హఫీజ్‌పూర్ కొత్వాలి (Hafizpur Kotwali ) ప్రాంతంలో పలు వాహనాలు ఒకదానికొకటి బలంగా ఢీ కొన్నాయి (Car Pileup).
Car Pileup | ఉత్తరప్రదేశ్‌లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. దేశరాజధాని ఢిల్లీకి (Delhi) సుమారు 86 కిలోమీటర్ల దూరంలో ఉన్న హాపూర్‌లోని హఫీజ్‌పూర్ కొత్వాలి (Hafizpur Kotwali ) ప్రాంతంలో పలు వాహనాలు ఒకదానికొకటి బలంగా ఢీ కొన్నాయి (Car Pileup). ఈ ఘటనలో పలువురు గాయపడ్డారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హపూర్-బులంద్‌షహర్ హైవేపై (Hapur-Bulandshahr highway) సోమవారం ఉదయం ఈ ప్రమాదం జరిగింది. పొగ మంచు (Dense Fog) కారణంగా సుమారు 10 వాహనాలు ఒకదానికొకటి బలంగా ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో పలు కార్లు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ప్రమాద సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాదంలో గాయపడిన వారిని వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. మరోవైపు ప్రమాదం నేపథ్యంలో హైవేపై భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. దీంతో దెబ్బతిన్న కార్లను క్రేన్ సాయంతో పోలీసులు అక్కడి నుంచి తొలగించి ట్రాఫిక్‌ను పునరుద్ధరించే చర్యలు చేపట్టారు.
దేశ రాజధాని ఢిల్లీ (New Delhi) సహా పలు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు దారుణంగా పడిపోయాయి. రాజధాని ప్రాంతంలో ఉష్ణోగ్రతలు 9.4 డిగ్రీల సెల్సియస్‌కు పడిపోయాయి. దీంతో రాజధాని ప్రాంతాన్ని దట్టంగా పొగ కమ్మేసింది (Dense Fog). దట్టమైన పొగ మంచు కారణంగా విజిబిలిటీ సరిగా లేక వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. భారత వాతావరణ విభాగం వెల్లడించిన వివరాల ప్రకారం.. రాజధాని సహా చుట్టు పక్కల ప్రాంతాల్లో విజిబిలిటీ జీరోకి పడిపోయింది.
ఢిల్లీలోని పాలెం విమానాశ్రయం, అమృత్సర్, ఆగ్రా, గ్వాలియర్, ప్రయాగ్‌రాజ్, జైసల్మేర్ విమానాశ్రయాల్లో విజిబిలిటీ 0 మీటర్లకు పడిపోయింది. ఢిల్లీ సఫ్దార్‌గంజ్‌లో 200 మీటర్లు, షిల్లాంగ్ విమానాశ్రయంలో 300 మీటర్లకు విజిబిలిటీ పడిపోయింది. ఈ ప్రతికూల వాతావరణ పరిస్థితులు జాతీయ, అంతర్జాతీయ విమానాల రాకపోకలకు తీవ్ర ప్రభావం పడింది. దట్టమైన పొగ మంచు కారణంగా పలు విమానాలు ఆలస్యంగా నడుస్తుండగా.. మరికొన్నింటిని దారి మళ్లించినట్లు అధికారులు తెలిపారు.
Also Read..
Shimla | న్యూఇయర్ వేళ సిమ్లాకు పోటెత్తిన పర్యాటకులు.. భారీగా ట్రాఫిక్ జామ్
Coronavirus | డేంజర్ బెల్స్.. దేశంలో 63 మందికి కొత్త వేరియంట్ జేఎన్.1
Human Trafficking | ఫ్రాన్స్‌ను వీడేందుకు 303 భారతీయులకు లభించిన అనుమతి.. విమానం ఎటు వెళ్లనుంది..?
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rahul Gandhi | నవంబర్ 1న జరిగే ర్యాలీని వాయిదా వేసుకోండి.. రాహుల్ గాంధీకి వ్యాపార సంఘాల వినతి
Sonia Gandhi: కేంబ్రిడ్జ్ వర్సిటీలో రాజీవ్ గాంధీతో ప్రేమ ప్రయాణం: సోనియా గాంధీ
Arunachal Anti-Dam Protest | డ్యామ్‌కు వ్యతిరేకంగా నిరసనలు.. కార్యాలయం, పలు వాహనాలకు నిప్పు
ఇల్లెందు నియోజకవర్గంలో బీఆర్ఎస్లో చేరికలు
Talasani srinivas Yadav | పట్టభద్రులు అందరూ ఓటర్లుగా నమోదు చేసుకోవాలి : మాజీ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

