USA | కెనడా-భారత్ వివాదంలో స్వరం మార్చిన అమెరికా.. విచారణలో భారత్‌కు ప్రత్యేకమైన మినహాంపులు ఉండవన్న అగ్రరాజ్యం
కెనడా-భారత్ వివాదంలో అగ్రరాజ్యం అమెరికా నెమ్మదిగా స్వరం మారుస్తున్నది. ఇరుదేశాల మధ్య పరిస్థితులను సమీక్షిస్తున్నట్టు ఇటీవల పేర్కొన్న అమెరికా తాజాగా కెనడా వైపు మొగ్గుచూపుతున్నట్టు తెలుస్తున్నది.
- కెనడా వైపు అగ్రరాజ్యం మొగ్గు
- భారత్‌కు మినహాయింపులు ఉండవంటూ వ్యాఖ్య
- కెనడా ఒత్తిడితో నిజ్జర్ అంశం లేవనెత్తిన బైడెన్
- జీ20లోనే మోదీతో ప్రస్తావన
USA | న్యూఢిల్లీ, సెప్టెంబర్ 22: కెనడా-భారత్ వివాదంలో అగ్రరాజ్యం అమెరికా నెమ్మదిగా స్వరం మారుస్తున్నది. ఇరుదేశాల మధ్య పరిస్థితులను సమీక్షిస్తున్నట్టు ఇటీవల పేర్కొన్న అమెరికా తాజాగా కెనడా వైపు మొగ్గుచూపుతున్నట్టు తెలుస్తున్నది. విచారణలో భారత్‌కు ఎటువంటి మినహాయింపులు ఉండవని అమెరికా జాతీయ భద్రతా సలహాదారు జాక్ సలివాన్ తెలిపడం చర్చనీయాంశంగా మారింది. మరోవైపు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ సైతం నిజ్జర్ హత్య అంశాన్ని ప్రధాని మోదీ వద్ద ప్రస్తావించినట్టు తెలుస్తున్నది. దీంతో అమెరికా స్వరం మారుస్తున్నట్టు విశ్లేషకులు భావిస్తున్నారు. కెనడా-భారత్ మధ్య నెలకొన్న వివాదంపై సలివాన్ స్పందించారు. ‘భారత దౌత్యవేత్తలతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నాం. భారత్‌కు ప్రత్యేకమైన మినహాంపులు ఏం ఉండవు. కెనడాతో మాకు విభేదాలు లేవు. కెనడాతోనూ సంప్రదింపులు జరుపుతున్నాం. ప్రాథమిక సూత్రాలకు కట్టుబడి ఉంటాం’ అని ఆయన పేర్కొన్నారు.
జీ20లోనే ప్రస్తావించిన బైడెన్…
జీ20 సమావేశాల్లో పాల్గొనేందుకు భారత్‌కు వచ్చిన అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ నిజ్జర్ హత్య అంశాన్ని ప్రధాని మోదీతో భేటీలో ప్రస్తావిచించినట్టు తెలుస్తున్నది. జో బైడెన్‌తో పాటు ఫైవ్ ఐలో ఉన్న ఇతర దేశాల నేతలు కూడా మోదీ వద్ద ఈ అంశాన్ని లేవనెత్తినట్టు బ్రిటన్ పత్రిక ఫైనాన్షియల్ టైమ్స్ పేర్కొంది.
కెనడా వద్ద ఆధారాలున్నాయా?
ఖలిస్థానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య వెనుక భారత హస్తం ఉన్నట్టు కెనడా వద్ద ఆధారాలున్నట్టు తెలుస్తున్నది. పక్కా సాక్ష్యాధారాలతోనే కెనడా ఆరోపణలు చేస్తున్నట్టు ఆ దేశ మీడియా పేర్కొంది. ఈ మేరకు సీబీఎస్ న్యూస్ వెల్లడించింది. సాక్ష్యాధారాలు ఉండటంతోనే కెనడా ప్రధాని ట్రూడో తీవ్రమైన ఆరోపణలు చేసినట్టు ఆ పత్రిక వెల్లడించింది. అందుకే దౌత్యపరమైన సంబంధాలను కూడా లెక్కచేయకుండా ఆయన భారత్‌వైపు వేలు చూపారని ఆ కథనంలో పేర్కొంది.
థామస్ వచ్చింది అందుకేనా?
నిజ్జర్ హత్య వెనుక భారత హస్తం ఉన్నట్టు ఫైవ్ ఐ నెట్‌వర్క్‌లోని ఓ దేశానికి చెందిన ఇంటెలిజెన్స్ వర్గాలు కెనడాకు ఆధారాలు అందించినట్టు ఆ పత్రిక తెలిపింది. కెనడా వద్ద హ్యూమన్, సిగ్నల్ ఇంటెలిజెన్స్‌కు సంబంధించిన సాక్ష్యాలు ఉన్నట్టు కెనడా ప్రభుత్వ ప్రతినిధులు కూడా ధ్రువీకరించినట్టు పేర్కొంది. భారత దౌత్య అధికారుల సంభాషణలు కూడా ఉన్నట్టు తెలిపింది. మరోవైపు విచారణకు హాజరుకావాలని భారత అధికారులను కెనడా కోరినట్టు వెల్లడించింది. కెనడా నేషనల్ సెక్యూరిటీ, ఇంటెలిజెన్స్ అడ్వైజర్ థామస్ ఆగస్టు, సెప్టెంబర్‌లో భారత్‌లో పర్యటించారని పేర్కొంది. ఈ ఆరోపణలను భారత దౌత్యవేత్తలు ఖండించలేదని వివరించింది.
ట్రూడోకు షాక్…
భారత్‌తో వివాదంలో తలమునకలైన ట్రూడోకు గట్టి షాక్ తగిలింది. ఆ దేశంలో ట్రూడో పాపులారిటీని గణనీయంగా కోల్పోయారు. సుమారు 60 శాతం మంది ఆయన ప్రధాని పదవి నుంచి దిగిపోవాలని కోరుకుంటున్నారు. ఈ మేరకు గ్లోబల్ న్యూస్ అనే సంస్థ నిర్వహించిన సర్వేలో తేలింది. అదే సమయంలో ప్రతిపక్ష నేత పియరీకి జనాధరణ పెరుగుతున్నది. 40 శాతం మంది పియరీ ప్రధాని కావాలని కోరుకుంటున్నారు.
బ్రెడ్ తింటూ..చెట్ల కింద ఉంటూ…
కెనడాలో విద్యనభ్యసించేందుకు వెళ్లిన భారతీయులు నానా అవస్థలు పడుతున్నారు. తినడానికి తిండి లేకపోవడంతో బ్రెడ్ తింటూ కాలం వెళ్లదీస్తున్నారు. మరోవైపు ఉండేందుకు ఇల్లు కూడా లేకపోవడంతో రోడ్లపైను పడుకుంటున్నారు. 2022లో అత్యధికంగా 2,26,450 మంది విద్యార్థులు కెనడాకు వెళ్లారు వీరందరికీ వసతి కల్పించడంలో అక్కడి వర్సిటీలు విఫలమవుతున్నాయి. దీంతో చెట్ల కింద, టెంట్లు వేసుకొని ఉండాల్సిన దుస్థితి తలెత్తింది. మరోవైపు అష్టకష్టాలు పడి చదువు పూర్తి చేసిన వారికి ఉద్యోగాలు దొరక్క ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కెనడాతో ఉద్రిక్తతల నేపథ్యంలో భారతీయ విద్యార్థుల కష్టాలు మరింత పెరిగాయి.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
కొల్చారంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ దగ్ధం.. గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిపివేత
Rudravanam PS | మారుమూల గ్రామం మిస్టరీతో ఆకట్టుకుంటున్న ‘రుద్రవనం పీఎస్’ ట్రైలర్!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

