Haryana Assembly Elections | హరియాణ ఎన్నికల్లో బీజేపీకి భంగపాటు తప్పదు : భూపీందర్ హుడా
Haryana Assembly Elections : హరియాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి భంగపాటు తప్పదని కాంగ్రెస్ పార్టీ విజయం సాధించి ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని హరియాణ మాజీ సీఎం భూపీందర్ సింగ్ హుడా పేర్కొన్నారు.
Haryana Assembly Elections : హరియాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి భంగపాటు తప్పదని కాంగ్రెస్ పార్టీ విజయం సాధించి ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని హరియాణ మాజీ సీఎం భూపీందర్ సింగ్ హుడా పేర్కొన్నారు. హరియాణ ప్రజలు కాషాయ సర్కార్ను సాగనంపి కాంగ్రెస్ సర్కార్కు పట్టం కట్టనున్నారని విశ్వాసం వ్యక్తం చేశారు. భూపీందర్ హుడా బుధవారం ఢిల్లీలో మీడియా ప్రతినిధులతో మాట్లాడారు.
హరియాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయం ఖాయమని, ప్రజలు మార్పు కోరుతున్నారని స్పష్టం చేశారు. కాగా, హరియాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఆ రాష్ట్ర ప్రజలపై కాంగ్రెస్ వరాల జల్లు కురిపించింది. ఏడు గ్యారంటీలతో మేనిఫెస్టోను రిలీజ్ చేసింది. కనీస మద్దతు ధరకు చట్టబద్దత సహా కులగణన చేపడతామని హామీ ఇచ్చింది. ఏడు గ్యారంటీలను కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే ప్రకటించారు.
మహిళా సాధికారత కింద 18 నుంచి 60 ఏళ్ల వయసు ఉన్న ప్రతి మహిళకు నెలకు రూ.2 వేలతో పాటు రూ.500కే గ్యాస్ సిలిండర్లను ఇస్తామని ప్రకటించింది. అదేవిధంగా వృద్ధులు, వికలాంగులు, ఒంటరి మహిళలకు నెలకు రూ.6 వేలు పింఛన్ ఇస్తామని తెలిపింది. 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, కుటుంబానికి రూ.25 లక్షల వరకు ఉచితంగా వైద్య చికిత్సను అందిస్తామని హామీ ఇచ్చింది.
Read More :
Donald Trump: ప్రధాని మోదీని కలుస్తా: డోనాల్డ్ ట్రంప్
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Nithin | నితిన్ ‘అలియాస్ రుక్మిణి’లో హీరోయిన్ ఎవరంటే.. రుక్మిణి పాత్రను పరిచయం చేసిన చిత్రబృందం!
Air India: బాంబు బెదిరింపు.. ఫ్రాంక్ఫర్ట్ నుంచి వస్తున్న విమానం జైపూర్లో ల్యాండింగ్
Virosh | విజయ్ దేవరకొండ, రష్మికలకు ముందే పెళ్లి చేశాం.. ‘రణబాలి’ డైరెక్టర్ ఆసక్తికర వ్యాఖ్యలు!
Road accident | కరీంనగర్ జిల్లాలో కారు ఢీ కొని యువకుడి మృతి
Veeramani Sweet Box | స్వీట్ బాక్స్ అడిగితే రూ. 70 కోట్ల మిలిటరీ ట్యాంక్ ఆర్డర్.. వేధింపులు తాళలేక ఇల్లు ఖాళీ చేసిన ఇన్ఫ్లుయెన్సర్!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

