గురుగ్రామ్: ఓ మైనర్ అమ్మాయిని అత్యాచారం చేసి ఆమె ఫోటోలను సోషల్ మీడియాలో పోస్టు చేసిన కేసులో భోజ్‌పురి గాయకుడి(Bhojpuri Singer)ని అరెస్టు చేశారు. నిందితుడిని బీహార్‌కు చెందిన 21 ఏళ్ల అభిషేక్‌గా గుర్తించారు. అతన్ని బాబుల్ బిహారీ అని కూడా పిలుస్తారు. అతని యూట్యూబ్ ఛానల్లో 27వేల మంది ఫాలోవర్లు ఉన్నారు. రెండేళ్ల క్రితం రాజీవ్ నగర్ ఏరియాలో ఉన్న అతను.. ఓ 13 ఏళ్ల అమ్మాయిని మోసం చేశాడు. ముందుగా ఆమెతో స్నేహం చేసి ఆ తర్వాత ఓ హోటల్ గదికి తీసుకువెళ్లి రేప్ చేశాడు.
ఇటీవల ఆ సింగర్ తన వద్ద ఉన్న మైనర్ ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేశాడు. ఆ ఫోటోలను చూసిన అమ్మాయి పేరెంట్స్ షాక్ అయ్యారు. ఆ తర్వాత ఆ అమ్మాయిని అడిగి తెలుసుకున్నారు. సింగర్ అనుచితంగా ప్రవర్తించినట్లు తెలుసుకున్న ఆ అమ్మాయి పేరెంట్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోక్సో ప్రకారం కేసు నమోదు చేశారు. ఎఫ్ఐఆర్ నమోదు అయిన కొన్ని క్షణాలకే అతన్ని అరెస్టు చేశారు.