PM Modi: ఇండియాలో ఇన్వెస్ట్ చేసేందుకు ఇదే బెస్ట్ టైం : ప్రధాని మోదీ
PM Modi: భారత్‌లో పెట్టుబడులు పెట్టేందుకు ఇదే ఉత్తమ సమయం అని ప్రధాని మోదీ అన్నారు. ఇండియా మొబైల్ కాంగ్రెస్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. మేకిన్ ఇండియాకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు చెప్పారు.
న్యూఢిల్లీ: భారత్‌లో పెట్టుబడులు పెట్టేందుకు ఇదే ఉత్తమ సమయం అని ప్రధాని మోదీ(PM Modi) అన్నారు. ఇండియా మొబైల్ కాంగ్రెస్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. మేకిన్ ఇండియాకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు చెప్పారు. మొబైల్స్, సెమీకండక్టర్స్, ఎలక్ట్రానిక్స్ రంగాల్లో వేగంగా సంస్కరణలు జరగుతున్నాయని, ఇన్వెస్ట్మెట్ అవకాశాలకు ఇదే అత్యుత్తమ సమయం అని మోదీ తెలిపారు. భారతీయ ప్రజాస్వామ్య విధానం ఈజ్ ఆఫ్ బిజినెస్‌కు అనుకూలంగా ఉందన్నారు. తమ ప్రభుత్వ పాలసీలతో దేశం ఇన్వెస్టర్ ఫ్రెండ్లీ ప్రాంతంగా మారిందన్నారు.
పెట్టుబడులకు, ఆవిష్కరణలకు, మేకిన్ ఇండియాకు ఇదే ఉత్తమ సమయం అన్నారు. సంస్కరణల వేగాన్ని మరింత విస్తరిస్తున్నామని మోదీ తెలిపారు. సెమీకండక్టర్లు, మొబైల్స్, ఎలక్ట్రానిక్స్ రంగాల్లో తయారీలకు భారత్ ప్రాధాన్యత ఇస్తోందన్నారు. పరిశ్రమలు, ఆవిష్కర్తలు, స్టార్టప్‌లు ఇప్పుడు మరింత దూసుకెళ్లాలన్నారు. డిజిటల్ రంగంలో గత దశాబ్ధ కాలంలో ఇండియా వేగంగా ముందుకెళ్లిందన్నారు. భారత్‌లో 1జీబీ డేటా .. ఒక కప్పు ఛాయ్ ధర కన్నా తక్కువే అని తెలిపారు.
డిజిటల్ కనెక్టివిటీ ఇప్పుడో ప్రత్యేక హక్కు లేదా లగ్జరీ కాదు అని, ఇది ప్రతి భారతీయుడి జీవితంలో అంతర్భాగమైందన్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద టెలికం మార్కెట్లో ఇండియా రెండో స్థానంలో ఉందన్నారు. 5జీ మార్కెట్లోనూ రెండో స్థానంలో ఉన్నామన్నారు. దేశంలో ఒకప్పుడు 2జీ సేవలు సరిగా అందలేదని, కానీ ఇప్పుడు ప్రతి జిల్లాలోనూ 5జీ సేవలు అందుబాటులో ఉన్నాయన్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
భూ సమస్యలు పరిష్కరించండి
ఇక ఏఐ డ్రైవింగ్ టెస్ట్ ట్రాక్‌లు
Kavya Maran Marriage | కేటీఆర్‌కు కళానిధి మారన్ దంపతుల ఆహ్వానం.. కావ్య మారన్ వివాహ రిసెప్షన్‌కు రావాలని పిలుపు!
Bathukamma Celebrations | ఎతుబార్పల్లిలో అంబరాన్నంటిన బతుకమ్మ సంబరాలు..
KTR | స్వదేశీ మొబిలిటీ ప్లాట్‌ఫామ్ ‘రుటూర్’ ప్రారంభం.. డ్రైవర్లకు కమీషన్ లేని సేవలే లక్ష్యం!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

