న్యూఢిల్లీ: ప్రపంచంలోనే రెండో అతి నెమ్మది (స్లోయెస్ట్ సిటీ) నగరంగా కర్ణాటక రాజధాని బెంగళూరు నిలిచింది. ఇక్కడ వాహనంపై ప్రతి పది కిలోమీటర్లు ప్రయాణించేందుకు 29.10 నిమిషాలు పడుతున్నట్టు డచ్ మల్టీ నేషనల్ డెవలపర్ టామ్ టామ్ సర్వేలో వెల్లడైంది. ఈ జాబితాలో మొదటి స్థానంలో లండన్ ఉంది. ఇక్కడ వాహనదారులకు ప్రతి పది కిలోమీటర్లు ప్రయాణించేందుకు 36.20 నిమిషాలు పడుతున్నది. 2022లో ప్రపంచవ్యాప్తంగా ఉన్న 56 దేశాల్లోని 389 నగరాలపై టామ్ టామ్ కంపెనీ నిర్వహించిన సర్వే ఫలితాలను తాజాగా విడుదల చేసింది. కర్బన ఉద్గారాల విడుదలలో బెంగళూరు ఐదో స్థానంలో నిలిచింది. ఈ నగరంలో పెట్రోల్ కార్ల నుంచి ఏడాదికి సగటున ప్రతి ఆరు మైళ్లకు 974 కిలోల కర్బన ఉద్గారాలు వెలువడుతున్నట్టు సర్వేలో తేలింది.