Cab Driver: భార్యను, ఆమె బంధువుల్లో ఆరుగుర్ని కడతేర్చిన క్యాబ్ డ్రైవర్
Cab Driver: బెంగుళూరులో ఓ క్యాబ్‌డ్రైవర్ ఏడు హత్యలకు పాల్పడ్డాడు. తొలుత భార్యను చంపి, ఆ తర్వాత ఆమె తల్లిని, ఇద్దరు అన్నలను, వారి భార్యలను చంపేశాడు. ఓ పిల్లోడిని కూడా హత్య చేశాడు. ఇంటి గొడవల్లో అత్తింటోళ్లు భార్యకే సపోర్టు ఇవ్వడంపై నిందితుడు ఆగ్రహానికి గురయ్యాడు.
బెంగుళూరు: కర్నాటక రాజధాని బెంగుళూరులో క్యాబ్‌డ్రైవర్(Cab Driver)గా చేస్తున్న ఇందూశేఖర్.. ఏడు హత్యలకు పాల్పడ్డాడు. తొలుత భార్యను చంపి, ఆ తర్వాత ఆమె తల్లి తరపున బంధువులను ఆరుగురిని హతమార్చాడు. పదేపదే భార్యాభర్తలమ మధ్య గొడవలు జరిగేవి, అయితే భార్య తల్లి, ఆమె అన్నావదినలు .. భార్యకే సపోర్టు ఇవ్వడం ఇందుశేఖర్కు నచ్చలేదు. దీంతో పగపట్టి వాళ్లను మర్డర్ చేశాడు. ఈ హత్యలకు చెందిన వివరాలను పోలీసులు వెల్లడించారు. బెంగుళూరులోని రాజాజినగర్‌లో ఇందుశేఖర్ నివసిస్తున్నాడు. సునితతో రెండు దశాబ్ధాల క్రితం అతనికి పెళ్లి అయ్యింది. అయితే తరుచూ భార్యాభర్తలు గొడవపడేవారు. అత్తింటి వారు ఆ కొట్లాటలను ఆపేవారు. కానీ భార్య.. ఆమె తల్లితో సన్నిహితంగా ఉండడం, ఆమె అన్నాదమ్ములు కూడా భార్యకు అండగా నిలవడంతో ఇందుశేఖర్ తీవ్ర ఆవేదనకు గురయ్యాడు. తన జీవితంలో జోక్యం చేసుకుంటన్న వారిని హతమార్చాలని ఇందుశేఖర్ ప్లాన్ చేసినట్లు పోలీసులు చెప్పారు.
పోలీసుల కథనం ప్రకారం సునితను తొలుత హత్య చేశాడు. ఓ బండరాయితో ఆమె తలపై మోదాడు. ఆ తర్వాత ఆమె శరీరాన్ని నంది హిల్స్‌కు తీసుకువెళ్లి ఖననం చేశాడు. అనుమానం రాకుండా ఉండేందుకు తన భార్య స్నేహితులతో కలిసి ట్రిప్‌కు వెళ్లినట్లు పక్కింటి వారిని నమ్మించాడు. మొబైల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసిందన్నాడు. ఆ తర్వాత రోజు ఒక్కొక్కరిగా బంధువులను ఇంటికి ఆహ్వానించాడు. బామ్మర్దులు శివకుమార్, శంకర్లను ముందుగా ఇంటికి పిలిచాడు. తాగుడు పార్టీ చేసుకుందామని చెప్పి వారిని మర్డర్ చేశాడు. ఆ తర్వాత వాళ్ల భార్యలు నళిని, దివ్యలను కూడా హతమార్చాడు. అత్త రూపవతి, శంకర్ ఏడేళ్ల కొడుకు పునీత్‌ను కూడా చంపేశాడు. ఒకరి తర్వాత ఒకర్ని ఇంటికి పిలిచి హత్య చేసినట్లు పోలీసులు భావిస్తున్నారు. ఆ ఏడుగురి శవాలను వేర్వేరు చోట్ల పడేశాడు.
మర్డర్ తర్వాత కెమికల్స్‌తో ఇంటిని శుభ్రం చేసేవాడు. హత్యకు వాడిన రాయిని పోలీసులు సీజ్ చేవారు. ఇక మృతదేహాలను తరలించిన కారును కూడా స్వాధీనం చేసుకున్నారు. నంది హిల్స్ నుంచి చిన్నారి పునీత్ డెడ్‌బాడీని పోలీసులు వెలికి తీశారు. మిగితావారి మృతదేహాల కోసం గాలిస్తున్నారు. అయితే తన కుమార్తె కనిపించడం లేదని నళిని తల్లి ఫిర్యాదు చేయడంతో ఈ హత్యల మిస్టరీ వీడింది. ఇందుశేఖర్ ఇచ్చిన విభిన్నమైన స్టేట్మెంట్ల ఆధారంగా నిందితుడు అతడే అని అనుమానిస్తున్నట్లు పోలీసులు చెప్పారు. ఇంట్లో నిత్యం భార్యతో వివాదాలు కలగడం వల్లే ఇందుశేఖర్ హత్యలకు పాల్పడినట్లు నిర్ధారించారు. ఈ హత్యల కేసులో అతని కూతుర్ని కూడా పోలీసులు విచారించనున్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Cab Driver: భార్యను, ఆమె బంధువుల్లో ఆరుగుర్ని కడతేర్చిన క్యాబ్ డ్రైవర్
Kothagudem | ప్రేమించడమే ఆమె చేసిన నేరం.. భార్యను హతమార్చిన ఏఆర్ కానిస్టేబుల్..?
Congress | నేను సీడబ్ల్యూసీ మెంబర్‌ను..! ఆఫ్ట్రాల్ టీపీసీసీ పిలిస్తే విచారణకు వస్తానా?
Namaste effect | గౌతమ్‌పూర్ గ్రామంలో చేతిపంపునకు మరమ్మతులు
Dhirendra Shastri: కృష్ణుడిపై అనుచిత వ్యాఖ్యలు.. ధీరేంద్ర శాస్త్రిపై క్రిమినల్ కేసు
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

