బెంగుళూరు: కర్నాటకలోని ఈస్ట్రన్ బెంగుళూరులో ఓ రౌడీషీటర్‌ను హత్య చేశారు. నలుగురు వ్యక్తులు కత్తులతో దాడి చేసి చంపారు. ఆ కేసులో బీజేపీ ఎమ్మెల్యే బైరతి బసవరాజ్(Byrathi Basavaraj)తో పాటు అయిదుగురిపై కేసు బుక్ చేశారు. శివకుమార్ అలియాస్ బిక్లు శివ అనే 40 ఏళ్ల రౌడీ హత్యకు గురయ్యాడు. హలసూరుకు చెందిన అతన్ని నలుగురు చంపేశారు. భారతీనగర్‌లో ఉన్న మీనే అవెన్యూ రోడ్డుపై మర్డర్ జరిగింది. మోటరుసైకిళ్లపై వచ్చిన వాళ్లు హత్యకు పాల్పడ్డారు. శివకుమార్ తల్లి హత్య కేసులో ఫిర్యాదు చేసింది. ఆమె ఫిర్యాదు ఆధారంగా అయిదుగురిపై కేసు బుక్ చేశారు. దాంట్లో ఎమ్మెల్యే బసవరాజ్‌తో పాటు జగదీశ్, కిరన్, విమల్, అనిల్ ఉన్నారు. ఓ ప్రాపర్టీ వివాదం వల్ల మర్డర్ జరిగినట్లు అంచనా వేస్తున్నారు. బీజేపీ ఎమ్మెల్యే రెచ్చగొట్టడం వల్లే నిందితులు రౌడీని హత్య చేసినట్లు తెలుస్తోంది. భారతీయ న్యాయ సంహితలోని 103 సెక్షన్ కింద భారతీయనగర్ పోలీసులు కేసు బుక్ చేశారు. దర్యాప్తు కొనసాగుతోంది.