నాగపూర్: బెంగుళూరు నుంచి రాజధాని ఎక్స్‌ప్రెస్‌లో ఓ ప్రయాణికుడు నాగ్‌పూర్ వరకు వెళ్లాడు. అయితే అతని టికెట్(Railway Ticket)పై వయసు కేవలం ఒక్క ఏడాది మాత్రమే ప్రింట్ అయి ఉన్నది. ఏడాది వయసున్న టికెట్‌తో ఆ ప్రయాణికుడు జర్నీ చేశాడు. జూన్ 23వ తేదీన 22691 నెంబర్ రైలులో ఈ ఘటన జరిగింది. టికెట్ చెకింగ్ సమయంలో రైల్వే టీసీ ఆ ప్రయాణికుడికి ఫైన్ వేశాడు. ఏడాది వయసు ఉన్నట్లుగా ఉన్న టికెట్‌తో 24 ఏళ్ల వ్యక్తి ప్రయాణించాడు. అతని పేరు రమాకాంత్. అయితే టీటీఈ వెరిఫికేషన్ సమయంలో ఈ-టికెట్‌పై 24కు బదులుగా 1 సంఖ్య ఉన్నది. డాటా ఎంట్రీలో పొరపాటు వల్ల టికెట్‌పై ఏడాది వయసు మాత్రమే ఉన్నట్లు తప్పుగా పడిందని ఆ ప్రయాణికుడు చెప్పాడు.
తన ఐడెంటిటీ కార్డును చూపించినా.. టీటీఈ మాత్రం అతనికి ఫైన్ వేశాడు. ప్రయాణికుడి వివరాలు సరిగ్గా లేవని జరిమానా విధించారు. దీంతో అతనికి 7035 ఫైన్ వేశారు. యూపీఐ ద్వారా రమాకాంత్ ఫైన్ చెల్లించాడు. నాగపూర్‌లో ట్రైన్ దిగిన తర్వాత అతను రైల్‌మదద్ సాయంతో ఫిర్యాదు నమోదు చేశాడు. కానీ ఒక్క రోజులోనే రైల్వే శాఖ తీర్పు ఇచ్చింది. టీటీవీ విధించిన జరిమానాను రైల్వే శాఖ సమర్థించింది. నియమావళి ప్రకారమే టీటీఈ ఫైన్ వసూల్ చేసినట్లు రైల్వే శాఖ చెప్పింది.
వాస్తవానికి ప్రయాణికులు తమ టికెట్‌ను చెక్ చేసుకోవాలని, ఒకవేళ తప్పులు ఉంటే సరిచేసుకోవాలని, ప్రయాణానికి ముందు వివరాలను మార్చుకోలేదని, సరైన టికెట్ లేని కారణంగా, 1989 రైల్వే చట్టంలోని సెక్షన్ 138 ప్రకారం ఆ ప్రయాణికుడికి జరిమానా వేసినట్లు రైల్వే అధికారులు తెలిపారు. అయితే ఏడాది వయసున్న ప్యాసింజెర్కు ఎలా టికెట్ ఇచ్చారన్న అంశాన్ని పరిశీలిస్తున్నామని సౌత్ వెస్ట్రన్ రైల్వే అధికారి మంజునాథ్ తెలిపారు. రిజర్వేషన్ టికెట్‌పై వయసు ఏడాది మాత్రమే ఉన్నప్పుడు, ఎలా ఆ టికెట్‌ను బుకింగ్ సిస్టమ్ ఆమోదించిందన్న కోణంలో దర్యాప్తు చేపడుతున్నట్లు చెప్పారు.