Mamata Banerjee | కోల్‌కతా, మార్చి 14: బెంగాల్ సీఎం మమతా బెనర్జీ తీవ్రంగా గాయపడ్డారు. 69 ఏండ్ల దీదీ గురువారం సాయంత్రం ఒక కార్యక్రమానికి హాజరై తన ఇంటికి వచ్చారు. ఇంట్లో పడిపోవటంతో ఆమె నుదుటిపై పెద్ద గాయం అయ్యిందని, ఆమె మేనల్లుడు అభిషేక్ బెనర్జీ వెంటనే దవాఖానకు తరలించిన ట్టు టీఎంసీ వర్గాలు తెలిపాయి.
‘మమతా బెనర్జీ నుదుటిపై పెద్ద గాయం అయ్యింది. ఆ మె స్వస్థత కోసం ప్రజలు ప్రార్థన చేయాలి’ అని పేర్కొంటూ నుదుటి నుంచి రక్తం వస్తు న్న ఆమె ఫొటోలను ఎక్స్‌లో పోస్ట్ చేశాయి.