కాన్పూర్, మే 17: బట్ట తలను కవర్ చేసుకోవడానికి చేయించుకున్న హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ శస్త్ర చికిత్స వికటించి ఇద్దరు ఇంజినీర్లు ఇటీవల మృతి చెందారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో జరిగింది. వారు ఓ ప్రైవేట్ క్లీనిక్‌లో సర్జరీ చేయించుకున్నారని, ఆ తర్వాత రియాక్షన్ తలెత్తి మరణించినట్టు బంధువులు చెప్తున్నారు.
మరణానికి గల కారణాలపై పోలీసులు లోతుగా విచారణ చేస్తున్నారు. అయితే ఈ ఘటనతో హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ సర్జరీలు సురక్షితమా? కాదా? అని సోషల్ మీడియాలో చర్చ మొదలైంది. ఈ నేపథ్యంలో నిపుణులు స్పందిస్తూ.. హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ సర్జరీలు సురక్షితమని స్పష్టం చేస్తున్నారు. అయితే సర్జరీకి వెళ్లే ముందు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, అప్పుడే సురక్షితమని స్పష్టం చేస్తున్నారు.
తీసుకోవాల్సిన జాగ్రత్తలు