
భోపాల్, డిసెంబర్ 26: మాలేగావ్ పేలుళ్ల కేసుల్లో నిందితురాలైన బీజేపీ ఎంపీ ప్రజ్ఞాసింగ్ ఠాకూర్ సరదాగా క్రికెట్ ఆడారు. మధ్యప్రదేశ్లోని శక్తినగర్లో ఆమె బ్యాటింగ్ చేస్తున్న వీడియో ఒకటి ఆదివారం వైరల్ అయింది. దీనిపై విపక్షాలు విమర్శలు గుప్పించాయి. అనారోగ్య కారణాలతో కేసు నుంచి బెయిల్ పొందిన ఆమె క్రికెట్ ఆడటం ఏంటని ప్రశ్నించాయి. ప్రజ్ఞా సింగ్ ఇప్పుడే కాదు గతంలోనూ క్రీడల్లో పాల్గొన్నారు. దేవీ నవరాత్రుల సందర్భంగా గర్భ డ్యాన్స్ చేశారు. పలు సందర్భాల్లో కబడ్డీ, బాస్కెట్ బాల్ ఆడారు.