మైఖేల్ జాక్సన్‌ను ఆకట్టుకున్న బప్పీలహరి గోల్డ్ గణేశ చైన్!
బాలీవుడ్ డిస్కో కింగ్ బప్పీలహరి (69) మరణం దేశ సంగీతాభిమానులను శోకసంద్రంలో ముంచింది. గత ఏడాది ఏప్రిల్‌లో కొవిడ్-19 బారినపడిన తర్వాత నుంచి ఆయన మంచానికే పరిమితమయ్యారు. అనారోగ్యంతో బాధపడుతూ మంగళవారం రాత్రి ఆయన మరణించారు.
ముంబై : బాలీవుడ్ డిస్కో కింగ్ బప్పీలహరి (69) మరణం దేశ సంగీతాభిమానులను శోకసంద్రంలో ముంచింది. గత ఏడాది ఏప్రిల్‌లో కొవిడ్-19 బారినపడిన తర్వాత నుంచి ఆయన మంచానికే పరిమితమయ్యారు. అనారోగ్యంతో బాధపడుతూ మంగళవారం రాత్రి ఆయన మరణించారు. 1973లో కెరీర్ ప్రారంభించిన లెజెండరీ సింగర్, సంగీత దర్శకుడు మరుపురాని హిట్ గీతాలతో ప్రేక్షకులను మైమరిపించారు. ఐ యామ్ ఏ డిస్కో డ్యాన్సర్, యార్ బినా చైన్ కహన్ రే, ఊలాలా వంటి సాంగ్స్ ప్రేక్షకులను ఉర్రూతలూగించాయి. గాయకుడు, కంపోజర్ గానే కాకుండా తనదైన సిగ్నేచర్ స్టైల్‌తో బప్పీలహరి ఎందరో అభిమానులను సంపాదించుకున్నారు. బప్పీలహరి ఒంటి నిండా బంగారు ఆభరణాలతో ఎంతమందిలో ఉన్నా ప్రత్యేకంగా కనిపించేవారు.
బప్పీలహరి ధరించే ప్రముఖ గణేశా గోల్డ్ చైన్ ఏకంగా మైఖేల్ జాక్సన్‌ను ఆకట్టుకుంది. 1996లో మైఖేల్ జాక్సన్ భారత్ పర్యటనకు వచ్చిన సమయంలో బప్పీలహరిని కలిశారు. డిస్కో డ్యాన్సర్లో జిమ్మి జిమ్మి సాంగ్‌కు తాను ఫిదా అయ్యానని ఈ సందర్భంగా బప్పీలహరితో మైఖేల్ జాక్సన్ చెప్పుకొచ్చారు. కొన్నేండ్ల కిందట కపిల్ శర్మ షోలో బప్పీలహరినే స్వయంగా ఈ విషయం తెలిపారు. జాక్సన్ ముంబై వచ్చిన సమయంలో తాను కూర్చున్న దగ్గరకు వచ్చిన ఆయన తన గోల్డ్ పెండెంట్‌ను చూసి మెచ్చుకున్నారని..ఇది చాలా బాగుంది మీ పేరేంటి అని అడిగారని బప్పీలహరి గుర్తుచేసుకున్నారు.
తనను తాను పరిచయం చేసుకున్న తర్వాత డిస్కో డ్యాన్సర్లో మీ జిమ్మీ జిమ్మీ సాంగ్‌కు తాను అభిమానినని చెప్పుకొచ్చాడని వివరించారు. మిథున్ చక్రవర్తి ఆడిపాడిన జిమ్మీ జిమ్మీ సాంగ్ ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యం పొందింది. దక్షిణ, మధ్య ఆసియా, తూర్పు, పశ్చిమ ఆఫ్రికాతో పాటు మధ్య ప్రాచ్య, తూర్పు ఆసియా దేశాలు సహా సోవియట్ యూనియన్నూ ఈ పాట ఊపేసింది. 1982లో డిస్కోడ్యాన్సర్లో జిమ్మీ జిమ్మీ పాటను బప్పీలహరి కంపోజ్ చేశారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

