Banks Strike | న్యూఢిల్లీ: ఈ నెల 24, 25 తేదీల్లో తలపెట్టిన దేశవ్యాప్త బ్యాంకుల సమ్మెను వాయిదా వేసినట్లు యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ ప్రకటించింది. సెంట్రల్ లేబర్ కమిషనర్‌తో శుక్రవారం జరిగిన చర్చలు సానుకూల ఫలితాలనిచ్చినట్లు తెలిపింది. బ్యాంకుల ఐదు రోజుల పని దినాలు, నియామకాలు, పనితీరు ప్రోత్సాహకాలు (పీఎల్ఐ) సహా ఇతర అంశాలపై మరింత చర్చించాలని ప్రతిపాదించినట్లు వెల్లడించింది. తమ డిమాండ్ల పట్ల సానుకూల పరిణామాల నేపథ్యంలో సమ్మెను ఒకట్రెండు నెలలు వాయిదా వేయాలని నిర్ణయించినట్లు తెలిపింది. తదుపరి చర్చలు ఏప్రిల్ మూడో వారంలో జరుగుతాయని పేర్కొంది.
న్యూఢిల్లీ: ఉల్లిపై 20 శాతం ఎగుమతి సుంకాన్ని కేంద్ర ప్రభుత్వం రద్దు చేసింది. ఈ నిర్ణయం వచ్చే నెల 1 నుంచి అమల్లోకి వస్తుంది. రైతుల ప్రయోజనాలను కాపాడటం కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్రం వెల్లడించింది. వినియోగదారులకు ఉల్లిపాయలు సరసమైన ధరలకు అందుబాటులో ఉంటాయని కేంద్రం తెలిపింది.