పని ఒత్తిడిని తట్టుకోలేక బ్యాంకు మేనేజర్ ఆత్మహత్య
బ్యాంకు మేనేజర్| పని ఒత్తిడిని తట్టుకోలేక ఓ బ్యాంకు మేనేజర్ ఆత్మహత్య చేసుకున్నది. ఈ విషాద ఘటన కేరళలోని కన్నూరు జిల్లా కుతుపరంబాలో జరిగింది. గతేడాది సెప్టెంబర్‌లో ఓ మహిళ ఉద్యోగి (38) ప్రమోషన్‌పై త్రిస్సుర్ నుంచి కొతుపరంబాలోని

తిరువనంతపురం: పని ఒత్తిడిని తట్టుకోలేక ఓ బ్యాంకు మేనేజర్ ఆత్మహత్య చేసుకున్నది. ఈ విషాద ఘటన కేరళలోని కన్నూరు జిల్లా కుతుపరంబాలో జరిగింది. గతేడాది సెప్టెంబర్‌లో ఓ మహిళ ఉద్యోగి (38) ప్రమోషన్‌పై త్రిస్సుర్ నుంచి కొతుపరంబాలోని తొక్కిలంగడి బ్రాంచ్‌కు మేనేజర్‌గా వచ్చింది. ఈ క్రమంలో పని ఒత్తిడిని తట్టుకోలేక శనివారం బలవన్మరణానికి పాల్పడింది.

రోజువారీ విధుల్లో భాగంగా ఓ మహిళా ఉద్యోగి బ్యాంకుకు వచ్చింది. అయితే మేనేజర్ తన గదిలో ఉరివేసుకుని కనిపించడంతో గట్టిగా కేకలు వేసింది. దీంతో తోటి ఉద్యోగులు, స్థానికులు ఆ మేనేజర్‌ను దవాఖానకు తరలించారు. అయితే అప్పటికే ఆమె మరణించిందని వైద్యులు నిర్ధారించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. అక్కడ లభించిన డైరీని స్వాధీనం చేసుకున్నారు. పనిఒత్తిడిని తట్టు్కోలేకపోతున్నానని, దీంతో ఈ తీవ్రమైన నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని అందులో పేర్కొన్నది. ఆమెకు 15, 13 ఏండ్ల వయస్సు కలిగిన ఇద్దరు పిల్లలు ఉన్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం దవాఖానకు తరలించారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవికూడా చదవండి..
వ్యాక్సినేషన్ రికార్డు.. 85 రోజుల్లోనే 10 కోట్ల మందికి టీకా
కన్యత్వ పరీక్షలో విఫలం.. అక్కాచెల్లెళ్లను గెంటేశారు
మరోసారి కెమెరాకు చిక్కిన ప్రేమ పక్షులు.. వైరల్‌గా మారిన ఫొటోలు
ఐఫోన్ పాస్‌కోడ్ మర్చిపోయారా? ఇలా చేయండి
టీకా కొరత కేంద్రం తప్పే
స్టేజీపై వివాదం.. కిరీటం వదులుకొన్న మిసెస్ వరల్డ్
లింగ పక్షపాతం చూపుతున్న ఫేస్బుక్ యాడ్స్
టీకా.. రాజు-పేద!
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sreeleela | రజినీకాంత్ ‘ధర్మన్’లో శ్రీలీల.. స్పెషల్ ప్రీ లుక్‌తో హింట్ ఇచ్చిన మేకర్స్!
EAPCET Office | గెస్ట్‌హౌస్‌గా ఎప్‌సెట్ ఆఫీస్.. అడ్మిషన్ల వేళ జేఎన్టీయూ సంచలన నిర్ణయం!
Congress | రైతును కూలీగా మార్చిన కాంగ్రెస్.. యాదాద్రి జిల్లా కొండ్రెడ్డిచెరువులో దుస్థితి
Heavy Rains | మురసు ఎఫెక్ట్‌తో రెండ్రోజులు భారీ వర్షసూచన.. ఈ నెల 15నాటికి మరో తుపాను!
Conductor Pravalika | బస్సులో ‘చిల్లర’ వివాదం.. ప్రయాణికురాలు నెట్టేయడంతో గాయపడ్డ కండక్టర్ ప్రవళిక మృతి
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

