నేడు బ్యాంకు ఉద్యోగుల సమ్మె
దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న తమ సమస్యలను పరిష్కారించాలంటూ బ్యాంకు యూనియన్లు శుక్రవారం దేశవ్యాప్తంగా సమ్మెను చేపడుతున్నాయి. శని, ఆదివారాలతోపాటు సోమవారం వినాయక చవితి కావటంతో వరుసగా నాలుగు రోజులపాటు బ్యాంక్ సేవలకు అంతరాయం కలుగనున్నది. వారానికి ఐదు రోజుల బ్యాంకింగ్ విధానం అమలు సహా పలు డిమాండ్లపై యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ (యూఎఫ్‌బీయూ) ఈ నెల 11 దేశవ్యాప్త సమ్మె నిర్వహించనుండటంతో తమ బ్యాంకు శాఖలు మూతపడనున్నాయని ఎస్బీఐ ఒక ప్రకటనలో తెలిపింది.
- 5 రోజుల పనిదినాలకు డిమాండ్
- వరుస సెలవులతో బ్యాంక్ సేవలకు అంతరాయం
న్యూఢిల్లీ, సెప్టెంబర్ 10: దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న తమ సమస్యలను పరిష్కారించాలంటూ బ్యాంకు యూనియన్లు శుక్రవారం దేశవ్యాప్తంగా సమ్మెను చేపడుతున్నాయి. శని, ఆదివారాలతోపాటు సోమవారం వినాయక చవితి కావటంతో వరుసగా నాలుగు రోజులపాటు బ్యాంక్ సేవలకు అంతరాయం కలుగనున్నది. వారానికి ఐదు రోజుల బ్యాంకింగ్ విధానం అమలు సహా పలు డిమాండ్లపై యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ (యూఎఫ్‌బీయూ) ఈ నెల 11 దేశవ్యాప్త సమ్మె నిర్వహించనుండటంతో తమ బ్యాంకు శాఖలు మూతపడనున్నాయని ఎస్బీఐ ఒక ప్రకటనలో తెలిపింది.
నగదు అవసరాల కోసం ఏటీఎంలు, డిపాజిట్ వెండింగ్ మెషిన్లను వినియోగించుకోవాలని ఖాతాదారులకు సూచించింది. బ్యాంకుల పనితీరు ఆధారంగా ఉద్యోగులకు చెల్లించే ప్రోత్సాహకాలను సమీక్షించాలని, ప్రైవేటీకరణ ప్రయత్నాలను నిలిపివేయాలన్న డిమాండ్లతో యూఎఫ్‌బీయూ ఈ సమ్మెకు పిలుపునిచ్చింది. తమ డిమాండ్లను పరిష్కరించకపోతే సెప్టెంబర్ 28, 29, 30 తేదీల్లో మరోసారి సమ్మె చేస్తామని తెలిపింది. అప్పటికీ కేంద్ర ప్రభుత్వం దిగి రాకుంటే అక్టోబర్ 26 నుంచి నిరవధిక సమ్మెకు దిగుతామని బ్యాంకు యూనియన్లు హెచ్చరిస్తున్నాయి.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
సింగరేణి మండలంలో 500 ఎకరాల్లో ఆయిల్‌పామ్ సాగు
మొక్కల వెంకటయ్యకు సత్కారం
Gayatri Devi | ఇంద్రకీలాద్రిపై గాయత్రీదేవి అలంకారంలో దర్శనమిచ్చిన దుర్గాదేవి
Ranabaali | ట్రైలర్‌కి డుమ్మా కొట్టిన రష్మిక .. ప్రీ రిలీజ్ ఈవెంట్లో విజయ్ దేవరకొండతో కలిసి సందడి
Supreme Court: సుప్రీంకోర్టును రాజకీయాల్లోకి లాగొద్దు: సీజేఐ సూర్యకాంత్
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

