Sheikh Hasina: బంగ్లాదేశ్ ప్రధాని తారిక్ రెహ్మాన్ నిర్ణయాన్ని తప్పుపట్టిన షేక్ హసీనా
Sheikh Hasina: గత నెలలో ఢిల్లీలో జరిగిన బ్రిక్స్ సమావేశాలకు బంగ్లాదేశ్ ప్రధాని తారిక్ రెహ్మాన్ హాజరుకాలేదు. అయితే ఆయన తీసుకున్న నిర్ణయాన్ని ఆ దేశ మాజీ ప్రధాని షేక్ హసీనా తప్పుపట్టారు. తారిక్ది అపరిపక్వమైన నిర్ణయమన్నారు. బంగ్లాదేశ్ జాతీయ ప్రయోజనాలను డ్యామేజ్ చేసినట్లు ఆరోపించారు.
న్యూఢిల్లీ: గత నెలలో ఢిల్లీలో బ్రిక్స్ సమావేశాలు జరిగిన విషయం తెలిసిందే. ఆ సమావేశాలకు బంగ్లాదేశ్ ప్రధాని తారిక్ రెహ్మాన్ హాజరుకాలేదు. అయితే ఆయన తీసుకున్న నిర్ణయాన్ని బంగ్లా మాజీ ప్రధాని షేక్ హసీనా(Sheikh Hasina) తప్పుపట్టారు. తారిక్ది అపరిపక్వమైన నిర్ణయమన్నారు. బంగ్లాదేశ్ జాతీయ ప్రయోజనాలను డ్యామేజ్ చేసినట్లు ఆరోపించారు. వ్యక్తిగత రాజకీయ అంచనాలు వేసి, విదేశీ విధానాన్ని దెబ్బతీస్తే నష్టం జరుగుతుందని ఆమె అన్నారు. ఓ వార్తాసంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె ఈ విషయాన్ని వెల్లడించారు. శక్తివంతమైన సభ్యదేశాలతో జరిగే మీటింగ్‌లో పాల్గొనడం వల్ల దేశ ఆర్థిక, సామాజిక వృద్ధికి కావాల్సిన అవకాశాలు దక్కేవని ఆమె తెలిపారు. కానీ ఇప్పుడు ఆ అవకాశాన్ని కోల్పోయినట్లు ఆమె చెప్పారు.
తాను ఢిల్లీలో ఉన్న కారణంగా బ్రిక్స్ సమావేశాలకు తారిక్ రెహ్మన్ హాజరుకాకపోవడం దురదృష్టకర సంఘటన అవుతుందన్నారు. వ్యక్తిగత అభిప్రాయాలు, రాజకీయ కుంచిత ఆలోచనల వల్ల రెండు దేశాల మధ్య సంబంధాలు ఏర్పడవని హసీనా అన్నారు. బాధ్యతాయుతమైన ప్రభుత్వం దేశ ద్వారాలను తెరవాలని, వాటిని మూసివేయడం కాదు అని ఆమె పేర్కొన్నారు. బ్రిక్స్ సమావేశాలకు హాజరుకావాలని బంగ్లా ప్రధాని తారిక్ రెహ్మాన్‌కు ఇండియా ఆహ్వానం అందజేసింది. కానీ రెహ్మాన్ ఆ సమావేశాకు రాలేదు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sheikh Hasina: బంగ్లాదేశ్ ప్రధాని తారిక్ రెహ్మాన్ నిర్ణయాన్ని తప్పుపట్టిన షేక్ హసీనా
Vijay Deverakonda | ‘ఎల్ నినో’ ముప్పు.. నీరు, ఆహారం, కరెంట్ వృథా చేయకండి: విజయ్ దేవరకొండ
Ranabaali | విజయ్ దేవరకొండ ‘రణబాలి’ అడ్వాన్స్ బుకింగ్స్ షురూ.!
Trisha | ఎంజీఆర్ బయోపిక్‌లో జయలలితగా త్రిష .. దర్శకుడు బషీర్ కామెంట్స్ వైరల్
Robot Harassment | అమ్మాయిలను వేధించిన రోబో.. 16 ఏళ్ల బాలికను తాకుతూ అసభ్య చేష్టలు!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

