Ayodhya Ram Mandir | కెమెరాలు కవర్ చేసి.. అందినంత కొట్టేసి..అయోధ్య విరాళాల స్కామ్ జరిగిన తీరిది
అయోధ్య రామ మందిరం విరాళాల్లో అవతకతవకల కేసులో రోజుకో కొత్త కోణం బయటకొస్తోంది. సిట్ నివేదిక ప్రకారం నిందితులు డబ్బులు, కానుకలు ఎలా దొంగిలించారో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి.
- ఆలయ లెక్కింపు గదిలో సిబ్బంది చేతి వాటం
- బ్యాంకులకు తరలించేటప్పుడూ దొంగతనం
- బాత్రూమ్లో దాచి ఆ తర్వాత ఎత్తుకెళ్లిన వైనం
- రూ.7.75 కోట్ల అవకతవకలు జరిగినట్టు అనుమానం!
- అయోధ్య విరాళాల స్కామ్ జరిగిన తీరిది
అయోధ్య: అయోధ్య రామ మందిరం విరాళాల్లో అవతకతవకల కేసులో రోజుకో కొత్త కోణం బయటకొస్తోంది. సిట్ నివేదిక ప్రకారం నిందితులు డబ్బులు, కానుకలు ఎలా దొంగిలించారో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. విరాళాలను లెక్కించే సిబ్బందిలో ఒకరు సీసీ కెమెరాలకు అడ్డంగా నిలబడగా.. మరొకరు డబ్బులను దొంగిలించి తన లోపలి దుస్తుల్లో దాచుకున్నాడని.. ఇలా కోట్లాది రూపాయలు మిస్ అయినట్టు సిట్ నివేదికలో వెల్లడైంది. అధికారులు జాతీయ మీడియాకు ఇచ్చిన సమాచారం ప్రకారం.. విరాళాల బ్యాంకు వివరాలను సమీక్షించినప్పుడు ట్రస్టు అధికారులకు అనుమానం వచ్చింది.
సాధారణంగా ఒక విరాళాల పెట్టెలో రూ.6 లక్షల నుంచి రూ.7 లక్షల వరకు ఉంటాయి. అయితే కొన్ని పెట్టెల్లో మాత్రం రూ.500 నోట్ల కట్టలు తక్కువగా ఉండటాన్ని అధికారులు గమనించి లెక్కింపు గదిలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. అక్కడ ఒక వ్యక్తి సీసీ కెమెరాలకు కొన్ని వారాల పాటు అడ్డంగా నిలబడటం అధికారులు గుర్తించారు. అలా నిలబడ్డప్పుడు మరో ఉద్యోగి డబ్బులను తన దుస్తుల్లో దాచుకునేవాడు. ఇలా కోట్ల రూపాయలు దోచేశారు.
బ్యాంకుకు తరలించేటప్పుడు..
కేవలం లెక్కింపు గదిలోనే కాకుండా ఇంకో విధంగా కూడా విరాళాలు పక్కదారి పట్టినట్టు సిట్ దర్యాప్తులో తేలింది. కౌంటింగ్ స్టాఫ్ నోట్ల కట్టల్లో ఉండాల్సిన దాని కంటే ఎక్కువ నోట్లను చొప్పించేవారు. బ్యాంకులకు తరలించే క్రమంలోనే సిబ్బంది ఆ కట్టల నుంచి ఎక్కువగా ఉన్న నోట్లను తీసుకునేవారు. అప్పుడు వోచర్లకు సరిపడా మొత్తం బ్యాంకులో జమ అయ్యేది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

