లక్నో, జూన్ 22: అయోధ్యలో బాల రాముడి విగ్రహానికి ప్రాణ ప్రతిష్ఠ చేసిన ప్రధాన పూజారి పండిట్ లక్ష్మీకాంత్ దీక్షిత్ (86) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన..శనివారం ఉదయం తుదిశ్వాస విడిచినట్టు కుటుంబసభ్యులు వెల్లడించారు.
విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి 121 మంది వేద పండితుల్ని ఎంపిక చేయగా, ఈ బృందానికి లక్ష్మీకాంత్ దీక్షిత్ నేతృత్వం వహించారు. కాశీ పట్టణంలో పేరొందిన పండితుల్లో ఒకరిగా దీక్షిత్ గుర్తింపు అందుకున్నారు. ఆయన మృతిపట్ల ప్రధాని మోదీ, ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్‌లు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.