Beef | బీఫ్ సమోసాలను తరలిస్తున్న ఆటో డ్రైవర్ అరెస్ట్
గోమాంసంతో నింపిన సమోసాలను తరలిస్తున్న ఆటో డ్రైవర్‌ను గుజరాత్‌లోని సూరత్‌లో అరెస్ట్ చేశారు. ఆటోలో బీఫ్ సమోసాలను ఓ వ్యక్తి తరలిస్తున్నాడనే సమాచారం అందుకున్న సూరత్ పోలీసులు మొసాల్ ప్రాంతం మీదుగా వెళుతున్న ఆటోను అడ్డగించి సోదాలు చేపట్టారు.
అహ్మదాబాద్ : గోమాంసంతో నింపిన సమోసాలను తరలిస్తున్న ఆటో డ్రైవర్‌ను గుజరాత్‌లోని సూరత్‌లో అరెస్ట్ చేశారు. ఆటోలో బీఫ్ (beef) సమోసాలను ఓ వ్యక్తి తరలిస్తున్నాడనే సమాచారం అందుకున్న సూరత్ పోలీసులు మొసాల్ ప్రాంతం మీదుగా వెళుతున్న ఆటోను అడ్డగించి సోదాలు చేపట్టారు. తనిఖీల్లో మాంసం నింపిన 45 సమోసాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
ఆటో డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు బీఫ్ సమోసాలను పరీక్షించాలని ఫోరెన్సిక్ బృందాన్ని కోరారు. సమోసాల్లో బీఫ్‌ను నింపారని ఎఫ్ఎస్ఎల్ నివేదికలో వెల్లడవంతో కేసు నమోదు చేశామని సూరత్ పోలీసులు వెల్లడించారు. నిందితుడిని ఇస్మాయిల్ యూసఫ్ జిబైగా గుర్తించారు. జంతు సంరక్షణ చట్టంలోని వివిధ సెక్షన్ల కింద యూసుఫ్‌పై కేసు నమోదు చేశామని సూరత్ డీఎస్పీ వీకే బనర్ తెలిపారు. బీఫ్‌ను నిందితుడికి ఎవరు సరఫరా చేశారనే వివరాలపైనా పోలీసులు కూపీ లాగుతున్నారు.
Read More
Sengol | కొత్త పార్లమెంట్లో రాజదండం
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో షాలినికి నాగార్జున గట్టి క్లాస్.. రోహిత్‌కు ‘మేలుకో రాజా’ అంటూ పంచ్!
3,296 కోట్ల రేడియల్ రహదారి టెండర్లలో భారీ కుంభకోణం.. ప్రభుత్వానికి కేటీఆర్ బహిరంగ లేఖ
Crop Holiday | పండుగ వేళ ప్రభుత్వం చేదు వార్త.. యాసంగి సాగుకు సెలవే!
Revanth Reddy | కరెంట్ లేదు.. ఇవ్వలేం!.. పవర్ అక్కెరపడే పనుల్ని వాయిదా వేయాలి.. సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన
Horoscope | 11-10-2026 ఆదివారం.. మీ రాశి ఫలాలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

