న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై జమ్ముకశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా (Omar Abdullah) వినూత్నంగా స్పందించారు. ప్రతిపక్ష ‘ఇండియా’ కూటమి పార్టీలైన కాంగ్రెస్, ఆప్‌ను మరోసారి తనదైన స్టైల్లో విమర్శించారు. ‘మరింతగా కొట్టుకోండి.. ఒకరిని ఒకరు అంతం చేసుకోండి’ అంటూ మీమ్‌తో ఎగతాళి చేశారు. ఇండియా కూటమిలో భాగమైన ఆప్, కాంగ్రెస్ ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో విడివిడిగా పోటీ చేశాయి. ఈ నేపథ్యంలో ఢిల్లీలో అధికారాన్ని ఆప్ కోల్పోవగా, కాంగ్రెస్ ఖాతా తెరువలేకపోయింది. దీంతో ఇండియా బ్లాక్‌కు చెందిన ఎన్సీ నేత, జమ్ముకశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా ఢిల్లీలో ఓటమిపై ఎక్స్‌లో స్పందించారు. ఆప్, కాంగ్రెస్‌ను ట్రోల్ చేశారు. ‘మీ హృదయానికి నచ్చేంతగా ఫైట్ చేయండి. ఒకరినొకరు అంతం చేసుకోండి’ అన్న మీమ్‌ను షేర్ చేశారు.
కాగా, లోక్‌సభ ఎన్నికల తర్వాత ప్రతిపక్షాల కూటమి ‘ఇండియా’ బ్లాక్‌లో విభేదాలు మరింత పెరిగాయి. కూటమికి నేతృత్వం లేకపోవడం, అంతర్గత సమావేశాలు నిర్వహించకపోవడం, సభ్య పార్టీల మధ్య ఐక్యత లేకపోవడాన్ని ఒమర్ అబ్దుల్లా పలుసార్లు బహిరంగంగా విమర్శించారు. ‘పార్లమెంటరీ ఎన్నికల కోసం మాత్రమే అయితే దానిని (కూటమిని) ముగించాలి’ అని ఇటీవల వ్యాఖ్యానించారు. ఢిల్లీ ఎన్నికల్లో కాంగ్రెస్, ఆప్ విడివిడిగా పోటీ చేయడంపై ఈ మేరకు మండిపడ్డారు.
Aur lado aapas mein!!! https://t.co/f3wbM1DYxk pic.twitter.com/8Yu9WK4k0c
— Omar Abdullah (@OmarAbdullah) February 8, 2025