న్యూఢిల్లీ: భారత్‌ను 21వ శతాబ్ధం వైపు మళ్లించిన శిల్పి మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి అని ప్రధాని మోదీ పేర్కొన్నారు. భారత ఆర్థిక ప్రగతికి బాటలు వేసిన సంస్కర్త అటల్జీ అని తెలిపారు. ఆశ్రితపక్షపాత ఆర్ధిక విధానాలకు ఆయన చరమగీతం పాడినట్లు చెప్పారు. ఇవాళ వాజ్‌పేయి నూరవ జయంతి. ఈ నేపథ్యంలో మోదీ ఓ ఆర్టికల్ రాశారు. అటల్జీ తన పార్లమెంట్ కాలంలో.. ఎక్కువ శాతం ప్రతిపక్ష బెంచ్‌లకే పరిమితమైనట్లు చెప్పారు. ఎప్పుడు కూడా ఆయన కాంగ్రెస్ పట్ల విస్మయాన్ని ప్రదర్శించలేదన్నారు. కానీ కాంగ్రెస్ మాత్రం అటల్‌జీని దేశద్రోహి అని ఆరోపించిందన్నారు.
#WATCH | Delhi: President Droupadi Murmu pays floral tribute to former PM Atal Bihari Vajpayee at the ‘Sadaiv Atal’ memorial on his 100th birth anniversary. pic.twitter.com/T7l316SCPy
— ANI (@ANI) December 25, 2024
మాజీ ప్రధాని అటల్.. ఓ రాజనీత్జుడు అని, ఆయన నిత్యం ప్రజలకు ప్రేరణగా నిలుస్తున్నారన్నారు. 90 దశకంలో దేశంలో రాజకీయ అనిశ్చితి నెలకొన్నదని, 9 ఏళ్లలో నాలుగు సార్లు లోక్‌సభ ఎన్నికలు జరిగాయని, ఆ సమయంలో వాజ్‌పేయి స్థిరమైన, ప్రభావంతమైన పరిపాలన అందించినట్లు చెప్పారు. సాధారణ ప్రజల పోరాటాన్ని వాజ్‌పేయి గుర్తించారన్నారు. ఆయన నాయకత్వ నైపుణ్యం సుదీర్ఘ కాలం అనేక రంగాలపై ప్రభావం చూపిందన్నారు. వాజ్‌పేయి అధికారంలో ఉన్న సమయంలో.. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, టెలికాం అండ్ కమ్యూనికేషన్స్ రంగాలు విశేష ప్రగతిని సాధించాయన్నారు.
#WATCH | Delhi: Prime Minister Narendra Modi pays floral tribute to former PM Atal Bihari Vajpayee at the ‘Sadaiv Atal’ memorial on his 100th birth anniversary. pic.twitter.com/HbA9fTLCHZ
— ANI (@ANI) December 25, 2024
ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన, ఢిల్లీ మోట్రోకు కూడా వాజ్‌పేయి పెద్దపీట వేసినట్లు తెలిపారు. గోల్డెన్ క్వాడ్రిలెటరల్ ప్రాజెక్టు కూడా ఆయన కీర్తిని పెంచిందన్నారు. సర్వశిక్షా అభియాన్ ద్వారా ఆయన ఆధునిక విద్యను అందించే ప్రయత్నం చేశారన్నారు. న్యూక్లియర్ పరీక్షలు చేపట్టి ఆ తర్వాత జరిగిన పరిణామాలను ఎదుర్కొన్న తీరు వాజ్‌పేయి నాయకత్వాన్ని చాటుతుందన్నారు.
Today, on Atal Ji’s 100th birth anniversary, penned a few thoughts on his monumental contribution to our nation and how his efforts transformed many lives.https://t.co/mFwp6s0uNX
— Narendra Modi (@narendramodi) December 25, 2024
వాజ్‌పేయి 100వ జయంతి సందర్భంగా ఇవాళ ఢిల్లీలోని సదైవ్ అటల్ స్మారకం వద్ద నేతలు పుష్పగుచ్చాలు ఉంచి నివాళి అర్పించారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి ధన్కడ్, స్పీకర్ బిర్లా , ప్రధాని మోదీ, అమిత్ షా, ఏపీ సీఎం చంద్రబాబు ఇతర కేంద్ర మంత్రులు, బీజేపీ నేతలు వాజ్‌పేయికి నివాళి అర్పించారు.