Cylinders explotion | అక్రమంగా వంద గ్యాస్ సిలిండర్ల నిలువ.. ఒక్కసారిగా పేలిన పది సిలిండర్లు.. Video
Cylinders explotion | నిర్మాణంలో ఉన్న భవనంలో ఒక్కసారిగా భారీ పేలుళ్లు సంభవించాయి. ఈ పేలుళ్ల ధాటికి భవనం గోడలు ఎగిరిపోయాయి. ఈ హఠాత్పరిణామంతో భయభ్రాంతులకు లోనయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటనా ప్రాంతానికి చేరుకున్నారు. ఫైరింజన్ల సాయంతో మంటలను ఆర్పేశారు.
పుణె: నిర్మాణంలో ఉన్న భవనంలో ఒక్కసారిగా భారీ పేలుళ్లు సంభవించాయి. ఈ పేలుళ్ల ధాటికి భవనం గోడలు ఎగిరిపోయాయి. ఈ హఠాత్పరిణామంతో భయభ్రాంతులకు లోనయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటనా ప్రాంతానికి చేరుకున్నారు. ఫైరింజన్ల సాయంతో మంటలను ఆర్పేశారు. నిర్మాణంలోని భవనంలో అక్రమంగా నిలువ ఉంచిన గ్యాస్ సిలిండర్లే పేలుళ్లకు కారణమని నిర్ధారించారు.
మహారాష్ట్రలోని పుణె నగరంలోగల విమన్ నగర్ ఏరియాలో ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం.. స్థానికంగా నిర్మాణంలో ఉన్న భవనంలో దాదాపు 100 గ్యాస్ సిలిండర్లను అక్రమంగా నిలువ ఉంచారు. ఆ సిలిండర్లను నిలువ ఉంచిన గదిలో మంటలు చెలరేగడంతో 10 నుంచి 12 సిలిండర్లు పేలిపోయాయి.
కాగా, ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు. ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరుగలేదన్నారు. ప్రమాదానికి సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉందని చెప్పారు. బాధ్యులపై చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.
#WATCH | Maharashtra | At least 10-12 LPG cylinders exploded near Symbiosis College in the Viman Nagar area of Pune city. Around 100 LPG gas cylinders were stored illegally in an under-instruction site. Out of 100 LPG cylinders, 10 cylinders exploded after a fire. 3 fire tenders… pic.twitter.com/dPzcEznUSn
— ANI (@ANI) December 27, 2023
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Polio Drops | పోలియో గురించి తల్లిదండ్రులు తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయాలు ఇవే..
Oh Na Siddayya | శంషాబాద్‌లో ఘనంగా ‘ఓ నా సిద్ధయ్య’ పాట విడుదల.. హాజరైన సోనూసూద్!
AP Elections | ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి : ఎస్ఈసీ అనిల్ చంద్ర పునేఠా
ముగిసిన సింగరేణి కంపెనీ స్థాయి చెస్, క్యారమ్స్ పోటీలు
MBA student dies | పరీక్షకు ముందు యూనివర్సిటీ భవనం పైనుంచి దూకి.. ఎంబీఏ విద్యార్థిని మృతి
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

