Jammu Kashmir Elections | జమ్మూ కశ్మీర్ ఎన్నికలపై సీఈసీ రాజీవ్ కుమార్ ఏమన్నారంటే..?
Jammu Kashmir Elections | జమ్మూ కశ్మీర్లో అసెంబ్లీ ఎన్నికలు లోక్సభ ఎన్నికల తర్వాత నిర్వహిస్తామని కేంద్ర ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ స్పష్టం చేశారు. లోక్సభ ఎన్నికల షెడ్యూల్ విడుదల సందర్భంగా ఆయన మీడియా సమావేశం నిర్వహించారు.
Jammu Kashmir Elections | జమ్మూ కశ్మీర్లో అసెంబ్లీ ఎన్నికలు లోక్సభ ఎన్నికల తర్వాత నిర్వహిస్తామని కేంద్ర ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ స్పష్టం చేశారు. లోక్సభ ఎన్నికల షెడ్యూల్ విడుదల సందర్భంగా ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మీడియా అడిగిన పలు ప్రశ్నలకు ఆయన సమాధానం ఇచ్చారు. భద్రత దృష్ట్యా ఒకేసారి ఎన్నికలు నిర్వహించడం సాధ్యం కాదని స్పష్టం చేశారు. ఎన్నికల్లో అభ్యర్థులకు భద్రత కేటాయించాల్సి ఉంటుందని.. దేశవ్యాప్తంగా ఎన్నికలు జరుగుతున్న సమయంలో కశ్మీర్లో ఎన్నికలు సాధ్యం కావన్నారు. 2019లో జమ్మూ కశ్మీర్ పునర్వ్యవస్థీకరణ చట్టాన్ని సవరించారన్నారు. డీలిమిటేషన్ ప్రక్రియ 2023లో ముగిసిందన్నారు.
మొత్తం 107 సీట్లలో 27 పాక్ ఆక్రమిత కశ్మీర్లో ఉన్నాయన్నారు. జమ్మూ కాశ్మీర్లోని అన్ని పార్టీలు పార్లమెంట్ ఎన్నికలతో పాటు అసెంబ్లీ ఎన్నికలను నిర్వహించాలని కోరాయన్నారు. కానీ, అధికార యంత్రాంగం ఏకకాలంలో ఎన్నికలు సాధ్యం కావని చెప్పినట్లు తెలిపారు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో 10-12 మంది అభ్యర్థులు ఉంటారని.. మొత్తంగా వెయ్యికంటే ఎక్కువ మంది అభ్యర్థులు ఉంటారన్నారు. ప్రతి ఒక్కరు అభ్యర్థికి బలగాలను అందించాల్సి ఉంటుందని.. ఈ సమయంలో అది సాధ్యం కాదన్నారు. పార్లమెంట్ ఎన్నికలు ముగిసిన వెంటనే అక్కడ ఎన్నికలు నిర్వహించేందుకు కష్టుబడి ఉన్నామన్నారు. హింసాత్మక మణిపూర్లోని శిబిరాల్లో నివసిస్తున్న ప్రజలు రాబోయే లోక్సభ ఎన్నికల్లో తమ శిబిరాల నుంచి ఓటు వేసేందుకు అనుమతి ఇస్తున్నట్లు తెలిపారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

