Anti-polygamy bill : బహుభార్యత్వం (Polygamy) ను నేరంగా పరిగణిస్తూ అస్సాం ప్రభుత్వం (Assam Govt) కొత్త చట్టం తీసుకొచ్చింది. ఈ చట్టం ప్రకారం బహుభార్యత్వ నేరానికి పాల్పడిన వ్యక్తికి పదేళ్ల కారాగార శిక్ష విధించవచ్చు. అయితే ఈ చట్టానికి కొన్ని మినహాయింపులు కూడా కల్పించారు.
ఆరో షెడ్యూల్ పరిధిలోని ప్రాంతాల్లో నివసిస్తున్న షెడ్యూల్డ్ తెగలకు ఈ చట్టం వర్తించదు. దీనిపై శాసనసభలో అస్సాం సీఎం హిమాంత బిశ్వశర్మ మాట్లాడుతూ.. బహుభార్యత్వ నిషేధ చట్టం అన్ని మతవర్గాలకు వర్తిస్తుందన్నారు. ఇది కేవలం ఇస్లాంకు వ్యతిరేకంగా తెచ్చింది కాదని చెప్పారు.