న్యూఢిల్లీ: ఉక్రెయిన్‌లోని ఖార్కీవ్పై రష్యా బాంబులతో విరుచుకుపడుతున్నది. ఈ నేపథ్యంలో భద్రత కోసం తక్షణం నగరాన్ని విడిచి సురక్షిత జోన్లకు వెళ్లిపోవాలని ఇండియన్ ఎంబసీ బుధవారం సూచించింది. సాయంత్రం 6 గంటల లోపు(భారత కాలమానం ప్రకారం రాత్రి 9.30) పిసోచిన్(11 కి.మీ), బబయే(12 కి.మీ), బెజ్ల్యుదోవ్కా(16 కి.మీ) సెటిల్మెంట్లకు చేరుకోవాలని అడ్వైజరీలో పేర్కొన్నది. వాహనాలు దొరకని వారు, రైల్వేస్టేషన్లలో ఉన్నవారు కాలినడకన వెళ్లాలని సూచించింది. ఉద్రిక్తతల నేపథ్యంలో ఖర్కీవ్‌లో 12 గంటల పాటు కర్ఫ్యూ విధించారు. రష్యా దాడుల నేపథ్యంలో భారత ఎంబసీ కీవ్ నుంచి ల్వీవ్కి మార్చామని కేంద్రం తెలిపింది.