Farooq Abdullah : జమ్ముకశ్మీర్ (Jammu and Kashmir) లోని పహల్గాం (Pahalgam) సమీపంలో పర్యాటకులే లక్ష్యంగా ఉగ్రవాదులు (Terrorists) కాల్పులు జరిపి 26 మందిని దారుణంగా చంపేశారు. మృతుల్లో 25 మంది భారతీయులు, ఒక నేపాలీ ఉన్నారు. ఈ నెల 22న జరిగిన ఈ క్రూర దాడితో దేశం యావత్తు దిగ్భ్రాంతికి గురైంది. ఈ దాడికి తామే బాధ్యులమని లష్కరే తోయిబా అనుబంధ విభాగమైన ది రెసిస్టెన్స్ ఫోర్స్ (TRF) ప్రకటించింది. ఈ లష్కరే తోయిబా అనే ఉగ్రవాద సంస్థను దాయాది పాకిస్థాన్ పెంచి పోషిస్తున్నది. దాంతో ఉగ్రదాడికి ప్రతిగా పాకిస్థాన్‌కు భారత్ గట్టి సమాధానం ఇవ్వాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి.
ఈ నేపథ్యంలో మీడియా ప్రతినిధులు తాము కలిసిన ప్రతి నాయకుడిని పాకిస్థాన్‌కు భారత ప్రభుత్వం ఎలాంటి సమాధానం ఇవ్వబోతోందనే ప్రశ్న అడుగుతున్నారు. ఈ క్రమంలోనే జమ్ముకశ్మీర్ మాజీ సీఎం, నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ చీఫ్ ఫరూక్ అబ్దుల్లాను కూడా అదే ప్రశ్న అడిగారు. దాంతో ఆయన తనదైన శైలిలో సమాధానం చెప్పారు. పాకిస్థాన్‌కు భారత్ ఎలాంటి సమాధానం చెప్పబోతోందనే ప్రశ్న అడగాల్సింది తనను కాదని, ప్రధాని నరేంద్రమోదీని అడగాలని సూచించారు.
#WATCH | Jammu: JKNC Chief Farooq Abdullah says, “Ask the Prime Minister on what answer should be given to Pakistan… ” pic.twitter.com/vCbYCNx9XU
— ANI (@ANI) April 28, 2025