India advises citizens | ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తత.. రెండు దేశాలకు ప్రయాణించవద్దని భారత పౌరులకు సూచన
India advises citizens | మిడిల్ ఈస్ట్‌లో ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. ఇజ్రాయెల్‌పై దాడులకు ఇరాన్ సన్నద్ధమవుతున్నది. ఈ నేపథ్యంలో కేంద్ర విదేశాంగ మంత్రిత్వ శాఖ శుక్రవారం సూచనలు జారీ చేసింది. ఇరాన్, ఇజ్రాయెల్‌కు ప్రయాణించవద్దని భారత పౌరులకు సూచించింది.
న్యూఢిల్లీ: మిడిల్ ఈస్ట్‌లో ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. ఇజ్రాయెల్‌పై దాడులకు ఇరాన్ సన్నద్ధమవుతున్నది. ఈ నేపథ్యంలో కేంద్ర విదేశాంగ మంత్రిత్వ శాఖ శుక్రవారం సూచనలు జారీ చేసింది. ఇరాన్, ఇజ్రాయెల్‌కు ప్రయాణించవద్దని భారత పౌరులకు సూచించింది. (India advises citizens) తదుపరి ఉత్తర్వులు జారీ చేసే వరకు దీనిని పాటించాలని పేర్కొంది. అలాగే ప్రస్తుతం ఇరాన్, ఇజ్రాయెల్‌లో నివసిస్తున్న భారతీయ పౌరులు సమీపంలోని భారత రాయబార కార్యాలయాలను సంప్రదించాలని, తమ పేర్లు నమోదు చేసుకోవాలని కోరింది. ఇరు దేశాల్లో నివసిస్తున్న భారతీయులు చాలా జాగ్రత్తగా ఉండాలని, అనవసర కదలికలను నియంత్రించాలని సూచించింది.
కాగా, ఏప్రిల్ 1న సిరియా రాజధాని డమాస్కస్‌లోని ఇరాన్ కాన్సులేట్‌పై ఇజ్రాయెల్ వైమానిక దాడి చేసింది. ఇరాన్ అగ్రశ్రేణి ఆర్మీ జనరల్, మరో ఆరుగురు ఇరాన్ సైనిక అధికారులు ఈ దాడిలో మరణించారు. ఈ నేపథ్యంలో ఈ దాడికి ప్రతీకారం తీర్చుకుంటామని ఇరాన్ హెచ్చరించింది. ఇజ్రాయెల్‌పై దాడికి సన్నద్ధమవుతున్నది. దీంతో మిడిల్ ఈస్ట్‌లో మరోసారి యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయి.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Newzealand Cricket | టీమిండియాతో వన్డే సిరీస్.. న్యూజిలాండ్ విధ్వంసక ఓపెనర్లకు పిలుపు..!
Telangana | తెలంగాణలో కొత్త జిల్లాలకు పదేళ్లు.. వికేంద్రీకరణ ప్రయాణంపై తొలి సీఎస్ రాజీవ్‌శర్మ కీలక విశ్లేషణ
Aadi Sai Kumar | ఆది సాయికుమార్‌పై దారుణమైన ట్రోలింగ్.. నాని, రవితేజల పేర్లు ప్రస్తావిస్తూ హీరో స్ట్రాంగ్ కౌంటర్!
Indian Athletes | పేదరికాన్ని జయించి.. ఆసియా క్రీడల్లో పతకాల పంట! మన క్రీడాకారుల స్ఫూర్తిదాయక విజయగాథలు
Saudi Arabia | రియాద్ విమానాశ్రయం దాడిలో 12మంది మృతి.. మూడొందల మందికి గాయాలు..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

