flight emergency landing | విమానంలో ప్రయాణికుడికి అస్వస్థత.. జైపూర్‌లో అత్యవసరంగా ల్యాండింగ్
flight emergency landing | విమానం గాల్లో ఉండగా ఒక ప్రయాణికుడు అస్వస్థతకు గురయ్యాడు. అతడి పరిస్థితి సీరియస్‌గా ఉండటంతో ఆ విమానాన్ని జైపూర్ విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండింగ్ చేశారు. (flight emergency landing) అనంతరం ఆ ప్రయాణికుడ్ని హాస్పిటల్‌కు తరలించారు.
న్యూఢిల్లీ: విమానం గాల్లో ఉండగా ఒక ప్రయాణికుడు అస్వస్థతకు గురయ్యాడు. అతడి పరిస్థితి సీరియస్‌గా ఉండటంతో ఆ విమానాన్ని జైపూర్ విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండింగ్ చేశారు. (flight emergency landing) అనంతరం ఆ ప్రయాణికుడ్ని హాస్పిటల్‌కు తరలించారు. అలయన్స్ ఎయిర్‌కు చెందిన విమానం శుక్రవారం ఉదయం ఢిల్లీ నుంచి మధ్యప్రదేశ్‌లోని జబల్పూర్కు టేకాఫ్ అయ్యింది. కొంత దూరం ప్రయాణించిన తర్వాత ఆ విమానం గాలిలో ఉండగా 52 ఏండ్ల ప్రయాణికుడు అస్వస్థత చెందాడు. అతడి బీపీ క్రమంగా పడిపోసాగింది.
కాగా, ఆ ప్రయాణికుడి ఆరోగ్య పరిస్థితిపై విమాన సిబ్బంది ఆందోళన చెందారు. ఈ నేపథ్యంలో విమాన పైలట్లు జైపూర్ విమానాశ్రయాన్ని కాంటాక్ట్ చేశారు. దీంతో ఉదయం 9.40 గంటలకు ఫ్లైట్‌ను ఆ విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండింగ్ చేశారు. వెంటనే ఆ ప్రయాణికుడ్ని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అనంతరం అలయన్స్ ఎయిర్ విమానం గమ్యస్థానమైన జబల్పూర్కు బయలుదేరింది. జైపూర్ విమానాశ్రయం అధికారులు ఈ విషయాన్ని వెల్లడించారు. అయితే ఆ ప్రయాణికుడి ఆరోగ్య పరిస్థితి ఎలా ఉన్నదో అన్నది స్పష్టం చేయలేదు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో షాలినికి నాగార్జున క్లాస్.. రోహిత్, అమన్‌లకు షాక్.. వచ్చే వారం కెప్టెన్సీకి నో!
Dasara Safety Tips | దసరాకు ఊరెళ్తున్నారా జాగ్రత్త..! గ్రేటర్లో దొంగల కలకలం
Rain | తెలంగాణలో మూడు రోజులు వానలు!
NTR | నెల్సన్ దర్శకత్వంలో రాక్..? ఎన్టీఆర్‌ను కలిసి కథ చెప్పిన నెల్సన్ దిలీప్‌కుమార్
India Protests | భారత్‌లో విద్యార్థి నిరసనల అణచివేతపై ప్రశ్నించండి.. 13 కోట్ల మంది ఓటర్ల తొలగింపు ఆందోళనకరం
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

