KC Venugopal | పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉంటా.. సీఎం పదవి దక్కకపోవడంపై కేసీ వేణుగోపాల్
KC Venugopal | చివరిదాకా సీఎం పదవి కోసం పోటీపడ్డ కాంగ్రెస్ జనరల్ సెక్రెటరీ (Congress General Secretary) కేసీ వేణుగోపాల్ (KC Venugopal) కు ఆఖరికి నిరాశే ఎదురైంది. కాంగ్రెస్ హైకమాండ్.. సీనియర్ నాయకులు అయిన కేసీ వేణుగోపాల్, రమేశ్ చెన్నితల (Ramesh Chennithala) ను పక్కనపెట్టి.. గత ఎల్డీఎఫ్ హయాం (LDF term) లో సీఎల్పీ నేత (CLP Leader) గా వ్యహరించిన వీడీ సతీశన్ (VD Satheesan) కు సీఎం పదవి కట్టబెట్టింది.
KC Venugopal : చివరిదాకా సీఎం పదవి కోసం పోటీపడ్డ కాంగ్రెస్ జనరల్ సెక్రెటరీ (Congress General Secretary) కేసీ వేణుగోపాల్ (KC Venugopal) కు ఆఖరికి నిరాశే ఎదురైంది. కాంగ్రెస్ హైకమాండ్.. సీనియర్ నాయకులు అయిన కేసీ వేణుగోపాల్, రమేశ్ చెన్నితల (Ramesh Chennithala) ను పక్కనపెట్టి.. గత ఎల్డీఎఫ్ హయాం (LDF term) లో సీఎల్పీ నేత (CLP Leader) గా వ్యహరించిన వీడీ సతీశన్ (VD Satheesan) కు సీఎం పదవి కట్టబెట్టింది. సీఎం పదవి ఆశించి భంగపడ్డ కేసీ వేణుగోపాల్‌ను మీడియా పలుకరించింది. సీనియర్లను కాదని వీడీ సతీశన్‌ను సీఎంగా ప్రకటించడంపై ఆయన అభిప్రాయాన్ని కోరింది.
దాంతో కేసీ వేణుగోపాల్ స్పందిస్తూ.. కేరళంలో ప్రస్తుత పరిస్థితిపై, సీఎం పేరును ఖరారు చేసేందుకు జరిగిన ప్రక్రియపై పార్టీ అగ్రనేతలు రాహుల్‌గాంధీ, ప్రియాంకాగాంధీ చర్చించారని చెప్పారు. వాళ్లిద్దరూ తనకు ఫోన్ చేసి తన అభిప్రాయం అడిగారని.. అందరం కలిసి చర్చించామని అన్నారు. ఏదేమైనా తనకు మద్దతుగా నిలిచిన ఎమ్మెల్యేలు, పార్టీ కార్యకర్తలు, నాయకులకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని చెప్పారు. సీఎం ఎవరనే విషయంలో చివరగా పార్టీ తుది నిర్ణయం తీసుకున్నదని, కాంగ్రెస్ పార్టీ సిన్సియర్ నాయకుడిగా పార్టీ హైకమాండ్ తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి ఉంటానని అన్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
IndiGo | సౌదీపై హౌతీ దాడుల ఎఫెక్ట్.. రియాద్, జెద్దా నుంచి విమానాలు రద్దు చేసిన ఇండిగో
Train | డిసెంబర్ 4న విజయ్ సేతుపతి ‘ట్రైన్’.. నితిన్, నాగచైతన్య సినిమాలకు గట్టి పోటీ!
Bathukamma Celebrations | దుబాయ్‌లో GTF ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా బతుకమ్మ సంబరాలు.. ఫొటోలు
Congress | కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల భూములను బలవంతంగా లాక్కుంటున్నది : సబితా ఇంద్రా రెడ్డి
ICC Player of the Month: శుభమన్ గిల్‌కు అయిదోసారి.. షఫాలీ వర్మకు రెండోసారి
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

