హరిద్వార్: అజయ్ కొథియాల్‌ను ఉత్తరాఖండ్ సీఎంగా చేయాలని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) జాతీయ కన్వీనర్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఆ రాష్ట్ర ప్రజలకు పిలపునిచ్చారు. ఉత్తరాఖండ్ అసెంబ్లీ ఎన్నికలపై ప్రధానంగా దృష్టిసారించిన ఆయన హరిద్వార్‌లో ఆదివారం రోడ్‌షో నిర్వహించారు. మంచి ఆసుపత్రులు, పాఠశాలలు నిర్మించామని చెప్పే ఏకైక పార్టీ ఆప్ అని తెలిపారు. అధికారంలోకి వస్తే ఇక్కడ కూడా అలాంటి పనులు చేస్తామని హామీ ఇచ్చారు. మీరు అజయ్ కొథియాల్‌ను ఉత్తరాఖండ్‌కి సీఎం చేయాలని కోరుకుంటున్నాని ప్రజలనుద్దేశించి కేజ్రీవాల్ అన్నారు. ఆయన కేదార్‌నాథ్‌ను తిరిగి అభివృద్ధి చేశారని, ఇప్పుడు మనంతా కలిసి ఉత్తరాఖండ్‌ను తిరిగి అభివృద్ధి చేద్దామని పిలుపునిచ్చారు.
#WATCH | Delhi CM and AAP national convener Arvind Kejriwal holds a roadshow in Haridwar, Uttarakhand. pic.twitter.com/91jWlRR425
— ANI (@ANI) November 21, 2021