న్యూఢిల్లీ, ఏప్రిల్ 1: అంతరిక్ష యాత్రలకు జాబిలిని మజిలీగా చేసే లక్ష్యంతో నాసా ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆర్టెమిస్-2 ప్రయోగం ఫ్లోరిడాలోని కెనడీ అంతరిక్ష కేంద్రం నుంచి బుధవారం రాత్రి జరగనున్నది. కమాండర్ రీడ్ వైజ్మెన్, పైలట్ విక్టర్ గ్లోవర్, నాసాకు చెందిన మిషన్ స్పెషలిస్ట్ క్రిస్టినా కోచ్, కెనడా స్పేస్ ఏజెన్సీకి చెందిన మిషన్ స్పెషలిస్ట్ జెరెమీ హన్సెన్ ఈ మిషన్లో భాగస్వాములయ్యారు. 1972లో జరిగిన అపోలో 17 తర్వాత అత్యంత దూరంగా నలుగురు వ్యోమగాములను పంపే నాసా అర్టెమిస్-2 మిషన్ను భారత కాలమానం ప్రకారం గురువారం వేకువజామున 3.54 గంటలకు ప్రయోగిస్తున్నారు. చంద్రుడి చుట్టూ తిరిగి 10 రోజుల్లో భూమి మీదికి సురక్షితంగా రావడం ఈ మిషన్ లక్ష్యం.