Rakesh Tikait | ‘జూన్ 9 లోగా బ్రిజ్ భూషణ్‌ను అరెస్ట్ చేయండి, లేకపోతే’.. కేంద్రానికి రైతు నేతలు అల్టిమేటమ్
Rakesh Tikait | మహిళా రెజ్లర్లపై లైంగిక దాడి ఆరోపణలు ఎదుర్కొంటున్న రెజ్లర్స్ ఫెడరేషన్ చీఫ్ బ్రిజ్ భూషణ్‌ను జూన్ 9లోగా అరెస్ట్ చేయాలని రైతు నేతలు డిమాండ్ చేశారు. లేనిపక్షంలో తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వానికి ఈ మేరకు శుక్రవారం అల్టిమేటమ్ ఇచ్చారు.
న్యూఢిల్లీ: మహిళా రెజ్లర్లపై లైంగిక దాడి ఆరోపణలు ఎదుర్కొంటున్న రెజ్లర్స్ ఫెడరేషన్ చీఫ్ బ్రిజ్ భూషణ్‌ను జూన్ 9లోగా అరెస్ట్ చేయాలని రైతు నేతలు డిమాండ్ చేశారు. లేనిపక్షంలో తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వానికి ఈ మేరకు శుక్రవారం అల్టిమేటమ్ ఇచ్చారు. రైతు నాయకుడు రాకేష్ తికాయిత్ (Rakesh Tikait) మీడియాతో మాట్లాడారు. రెజ్లర్స్ ఆందోళనను కేంద్ర ప్రభుత్వం పరిష్కరించాలని కోరారు. బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌ను అరెస్ట్ చేయడంపై తాము ఒక నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. జూన్ 9లోగా ఆయనను అరెస్ట్ చేయకపోతే నిరసనలను మరింత తీవ్రం చేస్తామని హెచ్చరించారు. ‘జూన్ 9 న రెజ్లర్లతో కలిసి ఢిల్లీలోని జంతర్ మంతర్‌కు వెళ్తాం. దేశవ్యాప్తంగా పంచాయితీలు నిర్వహిస్తాం’ అని అన్నారు.
కాగా, రైతుల మహా పంచాయితీ ఒత్తిడి వల్ల బ్రిజ్ భూషణ్ దిగి వచ్చినట్లు రైతు నేత రాకేష్ తెలిపారు. అందుకే ఈ నెల 5న అయోధ్యలో తలపెట్టిన ర్యాలీని ఆయన రద్దు చేసుకున్నారని చెప్పారు. ‘హర్యానా నుంచి కేంద్ర ప్రభుత్వానికి పెద్ద సందేశం ఇస్తున్నాం. బ్రిజ్ భూషణ్‌పై చర్యలకు వారం రోజుల సమయం ఇస్తున్నాం’ అని వార్నింగ్ ఇచ్చారు.
#WATCH | Haryana: We have taken a decision that Govt must address the grievances of wrestlers and he (Brij Bhushan Sharan Singh) should be arrested otherwise we will go with wrestlers to Jantar Mantar, Delhi on June 9 and will hold panchayats across the nation: Farmer leader… pic.twitter.com/dEnpTr4TmL
— ANI (@ANI) June 2, 2023
"If we aren't allowed to sit at Jantar Mantar on June 9 then there will be an announcement of Andolan," announces Khap leaders after meeting in support of wrestlers
Central govt has time till June 9. We will not compromise on anything less than the arrest of Brij Bhushan Sharan… pic.twitter.com/sR9jS4bjmg
— ANI (@ANI) June 2, 2023
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Antibiotics | యాంటీ బయోటిక్స్‌కు లొంగని బ్యాక్టీరియాను సైతం నాశనం చేసే వైరస్.. సైంటిస్టుల పరిశోధన..
Teacher Rapes Girl | విద్యార్థినులకు లైంగిక వేధింపులు, ఒక బాలికపై అత్యాచారం.. ప్రభుత్వ టీచర్ అరెస్ట్
KCR | తెలంగాణ ఆడబిడ్డలకు కేసీఆర్ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు
Delhi Police | నిరసనల సందర్భంగా మహిళలపై లైంగిక హింస.. ఢిల్లీ పోలీస్ హెడ్‌క్వార్టర్స్ వరకు మహిళా సంఘాల ర్యాలీ
Haiku Movie | కాలేజీ రోజులను గుర్తు చేసే సున్నితమైన ప్రేమకథ ‘హైకూ’.. అక్టోబర్ 23న భారీ విడుదల!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

