Encounter In Jammu Kashmir | ఉగ్రవాదులతో ఎన్కౌంటర్ : ఇద్దరు సైనికుల మృతి
జమ్ము కశ్మీర్‌లోని రాజౌరి జిల్లాలో బుధవారం భద్రతా దళాలు, ఉగ్రవాదుల మధ్య జరిగిన ఎన్కౌంటర్లో (Encounter In Jammu Kashmir) ఇద్దరు సైనికులు మరణించారు.
శ్రీనగర్ : జమ్ము కశ్మీర్‌లోని రాజౌరి జిల్లాలో బుధవారం భద్రతా దళాలు, ఉగ్రవాదుల మధ్య జరిగిన ఎన్కౌంటర్లో (Encounter In Jammu Kashmir) ఇద్దరు సైనికులు మరణించారు. కార్డన్ సెర్చ్ ఆపరేషన్‌లో భాగంగా ధర్మశాల సమీపంలోని బజిమాల్ ప్రాంతంలో ఇద్దరు ఉగ్రవాదులను సైన్యం చుట్టుముట్టింది. ఉగ్రవాదులు, భద్రతా దళాల మధ్య భీకర పోరు కొనసాగుతోందని అధికారులు తెలిపారు. కాల్పుల్లో ఓ అధికారి, సైనికుడు ప్రాణాలు కోల్పోగా, మరొకరికి గాయాలయ్యాయని వెల్లడించారు.
క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించామని అధికారులు తెలిపారు. కాగా, జమ్ము కశ్మీర్లో (Jammu and Kashmir) ఉగ్ర మూకలతో సంబంధాలున్నాయనే ఆరోపణలపై డాక్టర్, పోలీస్ సహా నలుగురు ప్రభుత్వ ఉద్యోగులను విధుల నుంచి తొలగించారు. ఎస్ఎంహెచ్ఎస్ హాస్పిటల్ శ్రీనగర్ అసిస్టెంట్ ప్రొఫెసర్ (మెడిసిన్) డాక్టర్ నిసారుల్ హసన్, కానిస్టేబుల్ (జమ్ము కశ్మీర్ పోలీస్) అబ్దుల్ మాజీద్ భట్, లేబరేటరీ బేరర్ అబ్ధుల్ సలాం రాదర్, టీచర్ ఫరూక్ అహ్మద్ మిర్‌లను సర్వీస్ నుంచి డిస్మిస్ చేసినట్టు అధికారులు వెల్లడించారు.
ఫరూక్ అహ్మద్ మిర్‌ను తొలుత 1994లో విద్యాశాఖలో నియమించగా ఆపై 2007లో టీచర్‌గా పదోన్నతి పొందారు. ఉగ్రవాదాన్ని కఠినంగా అణిచివేయడం, ఉక్కుపాదం మోపడమే తమ విధానమని, జమ్ము కశ్మీర్‌ను ఉగ్రవాద రహిత ప్రాంతంగా మలిచేందుకు ఎల్జీ యంత్రాంగం కట్టుబడి ఉందని ప్రభుత్వం పేర్కొంది.
Read More :
Ozone Hole: ఓజోన్ రంధ్రంపై పరిశోధకుల కొత్త రిపోర్టు
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rice Price | కిలో బియ్యం రూ.100 దాటనుందా? నెల రోజుల్లోనే 35 శాతం పెరిగిన సన్నబియ్యం ధరలు!
Rahul Sankrityan | ‘రణబాలి’పై నెగెటివ్ ప్రచారం చేశారు.. దర్శకుడు రాహుల్ సాంకృత్యాన్ సంచలన వ్యాఖ్యలు!
Paris Shooting: పారిస్‌లో రేసిస్ట్ అటాక్.. ఒకరు మృతి, అయిదుగురికి గాయాలు
Rajanna Sircilla | ఆపదలో ఉన్నా ఆదుకోరూ..! మంచానికే పరిమితమైన ఫీల్డ్ అసిస్టెంట్.. వైద్యం కోసం ఎదురుచూపు
Foreign currency | శంషాబాద్ ఎయిర్‌పోర్టులో భారీగా ఫారిన్ కరెన్సీ పట్టివేత
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

