Red Wine | న్యూఢిల్లీ, జూన్ 24: స్పెయిన్‌లోని కర్మొనాలో గల ఒక రోమన్ సమాధిలో 2 వేల ఏండ్ల నాటి పురాతన రెడ్ వైన్‌ను పురావస్తు శాస్త్రవేత్తలు గుర్తించారు. దీంతో ప్రపంచంలోనే అత్యంత పురాతనమైన వైన్‌గా ప్రస్తుతం వరకు ఉన్న క్రీ.శ.4వ శతాబ్దం నాటిదిగా చెప్తున్న వైన్ రికార్డును ఈ రోమన్ వైన్ చేజిక్కించుకుంది.
పీహెచ్ విలువ తదితర అనేక రసాయన పరీక్షల అనంతరం తాజాగా కనుగొన్న ఈ పాత వైన్ స్వచ్ఛమైనదేనని శాస్త్రవేత్తలు నిర్ధారించారు. అయితే ఇది ఏ రకం వైన్ అనేది పరిశీలించడానికి నాటి శాంపిళ్లు ఏవీ లేవని తెలిపారు.పురుషుడి అస్థి పంజరం వైన్‌లో మునిగి ఉందని.. తద్వారా ఆ కాలంలో మహిళలు వైన్ తాగడంపై నిషేధం ఉందని వారు చెప్తున్నారు.