శాన్ఫ్రాన్సిస్కో: ఇటీవల ఓ మహిళలో ప్రెగ్నెన్సీని గుర్తించి వార్తల్లో నిలిచిన యాపిల్ వాచ్.. ఈ సారి ఓ బాలిక ప్రాణం కాపాడింది. అరుదైన క్యాన్సర్‌ను గుర్తించి.. అప్రమత్తం చేయడంతో బాలికకు సకాలంలో వైద్యం అందింది. శాన్ఫ్రాన్సిస్కోకు చెందిన ఇమాని మైల్స్ చేతికున్న వాచ్ అదేపనిగా బీప్ శబ్దం చేయడం ప్రారంభించింది. ఆమె తల్లి జెస్సికా కిచెన్.. వాచ్ నోటిఫికేషన్ చూడగా హార్ట్ బీట్ అసాధారణంగా పెరిగినట్టు కనిపించింది. దీంతో వెంటనే తన కూతురును దవాఖానకు తీసుకెళ్లింది. అక్కడ పరీక్షలు చేసిన వైద్యులు అపెండిక్స్‌లో కణితి ఉన్నట్టు నిర్ధారించారు. వెంటనే ఆపరేషన్ చేయాలని చెప్పారు. ఇమానీకి సర్జరీ చేసి, కణితిని తొలగించారు.