న్యూఢిల్లీ, ఏప్రిల్ 28: ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ కంపెనీ యాపిల్.. అత్యాధునిక ఫీచర్లతో స్మార్ట్ వాటర్ బాటిల్‌ను మార్కెట్లోకి లాంచ్ చేసింది. హైడ్రేట్ స్పార్క్ పేరుతో తీసుకొచ్చిన ఈ బాటిల్ ధరను రూ.4,600గా నిర్ణయించింది. హైడ్రేట్ స్పార్క్ ప్రో స్టీల్, హైడ్రేట్ స్పార్క్ ప్రో అనే రెండు వేరియంట్లతో వీటిని తీసుకొచ్చింది. ఈ స్మార్ట్ వాటర్ బాటిల్ మనం రోజూ తీసుకొనే నీళ్ల స్థాయిలను లెక్కించి, యాపిల్ హెల్త్‌తో అనుసంధానం చేస్తుంది. బాటిల్ కింది భాగంలో ఎల్ఈడీ సెన్సర్ కూడా ఉంటుంది.