Bigg Boss 10 | బిగ్‌బాస్ 10లోకి జబర్దస్త్ బ్యూటీ .. సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం!
Bigg Boss 10 | తెలుగు బుల్లితెర ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న ‘బిగ్‌బాస్ తెలుగు’ పదో సీజన్‌కు రంగం సిద్ధమవుతోంది. ఇప్పటికే విజయవంతంగా తొమ్మిది సీజన్లు పూర్తి చేసుకున్న ఈ రియాలిటీ షో, ఇప్పుడు ల్యాండ్‌మార్క్ సీజన్‌గా పదో సీజన్‌తో ప్రేక్షకుల ముందుకు రానుంది. మేకర్స్ వరుస ప్రోమోలు, అప్డేట్స్తో ఆసక్తిని పెంచుతుండగా, కంటెస్టెంట్ల ఎంపికపై కూడా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.
Bigg Boss 10 | తెలుగు బుల్లితెర ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న ‘బిగ్‌బాస్ తెలుగు’ పదో సీజన్‌కు రంగం సిద్ధమవుతోంది. ఇప్పటికే విజయవంతంగా తొమ్మిది సీజన్లు పూర్తి చేసుకున్న ఈ రియాలిటీ షో, ఇప్పుడు ల్యాండ్‌మార్క్ సీజన్‌గా పదో సీజన్‌తో ప్రేక్షకుల ముందుకు రానుంది. మేకర్స్ వరుస ప్రోమోలు, అప్డేట్స్తో ఆసక్తిని పెంచుతుండగా, కంటెస్టెంట్ల ఎంపికపై కూడా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ప్రస్తుత సమాచారం ప్రకారం ‘బిగ్‌బాస్ తెలుగు 10’ ఆగస్టు చివరి వారంలో లేదా సెప్టెంబర్ తొలి వారంలో ప్రారంభమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈసారి కూడా సెలబ్రిటీలతో పాటు సామాన్యులకు అవకాశం కల్పిస్తూ ‘అగ్నిపరీక్ష 2’ ద్వారా కంటెస్టెంట్లను ఎంపిక చేయనున్నారు.
పదో సీజన్ కావడంతో హౌస్‌లో అనేక సర్ప్రైజ్లు, కొత్త గేమ్స్, వినూత్న టాస్కులు, భిన్నమైన కాన్సెప్ట్‌లు ఉండనున్నట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో ఈ సీజన్‌పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే పలువురు టీవీ నటులు, యూట్యూబర్లు, సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్ల పేర్లు బిగ్‌బాస్ కంటెస్టెంట్ల జాబితాలో వినిపిస్తున్నాయి. పల్లవి గౌడ, తేజస్విని గౌడ, నందూస్ వరల్డ్ ఫేమ్ నందన, వాసంతి కృష్ణన్ కుటుంబ సభ్యులు, ఎక్స్‌ప్రెస్ హరి, నూకరాజు, రాకింగ్ రాకేష్, జ్యోతి, రాయల్ మెక్ రమణ, శివ్, కడలి సత్యనారాయణ, జబర్దస్త్ వర్ష, వర్షిణి, ప్రభాకర్ లేదా చంద్రహాస్ వంటి పేర్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
అయితే ఈ జాబితాలో తాజాగా మరో పేరు బలంగా వినిపిస్తోంది. ఆమెనే జబర్దస్త్ లేడీ కమెడియన్ పవిత్ర. జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ వంటి పలు కామెడీ షోల ద్వారా మంచి గుర్తింపు సంపాదించుకున్న పవిత్ర ప్రస్తుతం బిగ్‌బాస్ సీజన్ 10లో పాల్గొనే అవకాశాలు ఉన్నాయని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఒకప్పుడు బ్యూటీ పార్లర్లో పనిచేసిన పవిత్ర, తన ప్రతిభతో, కష్టంతో బుల్లితెరపై ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు. కామెడీ టైమింగ్, ఎనర్జీ, సహజమైన ప్రవర్తనతో ఆమె ప్రేక్షకులకు దగ్గరయ్యారు. గతంలో కూడా పవిత్ర పేరు బిగ్‌బాస్ కంటెస్టెంట్‌గా పలుమార్లు వినిపించింది. అయితే ఈసారి మాత్రం ఆమె హౌస్‌లోకి వెళ్లే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని సోషల్ మీడియా వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే బిగ్‌బాస్ టీమ్ ఆమెతో చర్చలు జరిపినట్లు కూడా ప్రచారం జరుగుతోంది. పవిత్ర నిజంగానే బిగ్‌బాస్ హౌస్‌లోకి అడుగుపెడితే ఎంటర్టైన్మెంట్కు కొదవ ఉండదని అభిమానులు భావిస్తున్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
North Korea: బాలిస్టిక్ క్షిపణులను పరీక్షించిన ఉత్తర కొరియా
Aadarsha Kutumbam | ఆదర్శ కుటుంబంలో అదిరిపోయే సర్ప్రైజ్.. వెంకటేష్ అభిమానులకు త్రివిక్రమ్ ట్రీట్!
Road Accident | మద్యం మత్తులో కారు నడిపి స్కూటీని ఢీకొట్టిన యువకుడు.. ముగ్గురు దుర్మరణం..!
Mythri Movie Makers | మైత్రీ మూవీ మేకర్స్ నుంచి మరో రొమాంటిక్ కామెడీ.. డెబ్యూ ఇస్తున్న శ్రీకాంత్ కుమార్తె
IAS Transfers | ఏపీలో పలువురు ఐఏఎస్‌ల బదిలీ.. పర్యాటక శాఖ కార్యదర్శిగా ఆమ్రపాలికి పోస్టింగ్!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

