FIFA 2026 | చరిత్ర సృష్టించిన జపాన్.. ఫిఫా 1000వ మ్యాచ్‌లో ట్యునీషియాను 4-0తో చిత్తుచేసిన సమురాయ్ టీమ్
JPNvsTUN | ఫిఫా వరల్డ్ కప్ 2026 గ్రూప్-ఎఫ్‌లో భాగంగా ఆదివారం మెక్సికోలోని మాంటెర్రే స్టేడియంలో జరిగిన చారిత్రాత్మక 1000వ వరల్డ్ కప్ మ్యాచ్‌లో జపాన్ జట్టు ట్యునీషియాను 4-0 తేడాతో చిత్తుచేసింది.
JPNvsTUN | ఫిఫా వరల్డ్ కప్ 2026 గ్రూప్-ఎఫ్‌లో భాగంగా ఆదివారం మెక్సికోలోని మాంటెర్రే స్టేడియంలో జరిగిన చారిత్రాత్మక 1000వ వరల్డ్ కప్ మ్యాచ్‌లో జపాన్ జట్టు ట్యునీషియాను 4-0 తేడాతో చిత్తుచేసింది.
మ్యాచ్ మొదలైన నాలుగో నిమిషంలోనే దాచి కమాడ క్లోజ్ రేంజ్ నుంచి గోల్ కొట్టి జపాన్‌కు శుభారంభం ఇచ్చాడు. వరల్డ్ కప్‌లో జపాన్ తరపున నమోదైన అత్యంత వేగవంతమైన గోల్ ఇదే. ఆ తర్వాత 31వ నిమిషంలో స్టార్ ఫార్వర్డ్ అయాసే ఉయెడ ట్యునీషియా డిఫెన్స్‌ను చేధిస్తూ లో షాట్‌తో రెండో గోల్ సాధించాడు. రెండో అర్ధభాగంలో 69వ నిమిషంలో జున్యా ఇతో గోల్‌తో జపాన్ ఆధిక్యాన్ని 3-0కు పెంచాడు. 83వ నిమిషంలో మళ్లీ ఉయెడ హెడర్‌తో రెండో గోల్ కొట్టి మ్యాచ్‌కు హీరోగా నిలిచాడు. రెండు అద్భుత గోల్స్‌తో ఉయెడ మ్యాచ్‌ను జపాన్ వైపు తిప్పేశాడు. వరల్డ్ కప్ చరిత్రలో జపాన్‌కు ఇదే అతిపెద్ద విజయం కావడం విశేషం. ఈ భారీ గెలుపుతో జపాన్ 4 పాయింట్లతో గ్రూప్-ఎఫ్‌లో నెదర్లాండ్స్‌తో కలిసి అగ్రస్థానంలో నిలిచింది. దీంతో రౌండ్ ఆఫ్ 32 అవకాశాలను జపాన్ మరింత మెరుగుపరుచుకుంది. వరుసగా రెండో ఓటమితో ట్యునీషియా టోర్నీ నుంచి అధికారికంగా నిష్క్రమించింది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

