చెన్నై: తమిళనాడు సీఎం విజయ్(CM Vijay)పై అభ్యంతరకర కాంటెంట్‌ను ప్రచారం చేస్తున్న యాపిల్ సంస్థ ఉద్యోగిని అరెస్టు చేశారు. కోయంబత్తూరు జిల్లాలోని సూలూరులో జరిగిన పదేళ్ల చిన్నారి అత్యాచారం, హత్య కేసు అంశంలో యాపిల్ సంస్థ ఉద్యోగి అనుచిత వ్యాఖ్యలు చేశారు. తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్న అతన్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మైనర్ బాలిక హత్యా ఘటన తమిళనాడులో తీవ్ర దుమారం రేపుతున్నది. ఈ ఘటనతో లింకున్న కేసులో ఇప్పటికే పోలీసులు ఇద్దర్ని అరెస్టు చేశారు. వారిని కార్తీ, మోహన్ రాజ్‌గా గుర్తించారు. ఆ కేసులో ఇంకా దర్యాప్తు కొనసాగుతున్నది.
ఈ నేపథ్యంలో తరునేల్వెల్లి జిల్లాకు చెందిన వ్యక్తి, బెంగుళూరులోని యాపిల్ సంస్థలో పనిచేస్తున్న జేమ్స్ రాజా అనే వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. సోషల్ మీడియాలో సీఎం విజయ్‌ని కింపరిచే రీతిలో ఆ వ్యక్తి పోస్టు పెట్టారు. నిందితుడు జేమ్స్ రాజా.. పాలాయమ్ కొట్టై ప్రాంతానికి చెందినట్లుగా గుర్తించారు. గడిచిన రెండు నెలల నుంచి అతను మెడికల్ లీవ్‌పై ఉన్నట్లు తెలుస్తోంది. పాలయంకొట్టై ఎస్ఐ ప్రకారం నిందితుడు జేమ్స్‌పై కేసు బుక్ చేశారు. అతనిపై నాలుగు సెక్షన్లు విధించారు. కోర్టులో అతన్ని ప్రవేశపెట్టారు. ఆ తర్వాత అతన్ని జుడిషియల్ కస్టడీలోకి తీసుకోనున్నారు.