Trisha | సౌత్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న త్రిష మరోసారి సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. వరుసగా కోలీవుడ్ స్టార్ హీరోల కెరీర్లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాల్లో ఆమె భాగం కావడం ఇప్పుడు అభిమానుల మధ్య ఆసక్తికర చర్చకు దారితీసింది. దీంతో “త్రిష లక్కీ ఛార్మ్” అంటూ నెటిజన్లు సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు. ఇటీవల ఓ అభిమాని సోషల్ మీడియాలో చేసిన పోస్ట్ విపరీతంగా వైరల్ అయింది. ప్రముఖ హీరోలు అజిత్, విజయ్, సూర్య కెరీర్లలో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాల్లో త్రిష హీరోయిన్గా నటించడాన్ని ప్రస్తావిస్తూ.. “వారి బ్లాక్‌బస్టర్ విజయాల వెనుక త్రిష మ్యాజిక్ ఉంది” అంటూ రాసుకొచ్చాడు. ఈ పోస్టును త్రిష తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేస్తూ హార్ట్ ఎమోజీతో స్పందించింది. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది.
ప్రస్తుత తమిళనాడు సీఎం, కోలీవుడ్ స్టార్ హీరో విజయ్‌తో త్రిష నటించిన ‘లియో’ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. దర్శకుడు లోకేష్ కనగరాజ్ తెరకెక్కించిన ఈ చిత్రం 2023లో విడుదలై ప్రపంచవ్యాప్తంగా రూ.600 కోట్లకు పైగా వసూళ్లు సాధించినట్లు ట్రేడ్ వర్గాలు తెలిపాయి. విజయ్ కెరీర్లోనే అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా ఇది నిలిచింది. కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్ నటించిన ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ కూడా భారీ విజయాన్ని అందుకుంది. దర్శకుడు అధిక్ రవిచంద్రన్ రూపొందించిన ఈ యాక్షన్ ఎంటర్టైనర్లో త్రిష కీలక పాత్రలో నటించింది. ఈ సినిమా రూ.248 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించి అజిత్ కెరీర్లో బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచినట్లు ప్రచారం జరుగుతోంది.
కొంతకాలంగా సరైన హిట్ కోసం ఎదురుచూస్తున్న సూర్య.. ‘కరుప్పు’ (తెలుగులో ‘వీరభద్రుడు’) సినిమాతో మళ్లీ విజయాన్ని అందుకున్నాడు. ఈ చిత్రంలో త్రిష లాయర్ ప్రీతి పాత్రలో నటించి ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.300 కోట్లకు పైగా వసూళ్లు సాధించినట్లు సమాచారం. ఈ మూడు సినిమాల్లో కూడా త్రిష హీరోయిన్గా కనిపించడంతో.. అభిమానులు ఆమెను “లక్కీ ఛార్మ్” అంటూ ప్రశంసిస్తున్నారు. ప్రస్తుతం త్రిష తెలుగులో మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ‘విశ్వంభర’ చిత్రంలో నటిస్తోంది. దర్శకుడు వశిష్ట మల్లిడి తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో ఆమె అవని పాత్రలో కనిపించనుంది. ఈ సినిమాపై కూడా ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.