Accident | హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డుపై ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఓ కంటైనర్ లారీ శామీర్ పేట్ వద్ద ఔటర్ రింగ్ రోడ్డుపై ఆగి ఉండగా.. వెనుక నుండి వచ్చిన డీసీఎం ఆ లారీని ఢీకొట్టింది. ఈ ఘటనలో డీసీఎంలో ఉన్న ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా.. మరొకరికి తీవ్రగాయాలయ్యాయి.
సమాచారమందుకున్న శామీర్ పేట్ పోలీసులు డీసీఎంలో ఇరుక్కుని గాయాలపాలైన వ్యక్తిని స్థానికుల సాయంతో బయటకు తీసి చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదంతో ఔటర్‌రింగ్ రోడ్డుపై వాహన రాకపోకలు స్తంభించి ట్రాఫిక్ జామ్ అయింది. పోలీసులు ట్రాఫిక్ జామ్‌ను క్లియర్ చేస్తున్నారు. ఘటన జరిగిన సమయంలో సమీపంలో వేరే వాహనాలేమీ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పినట్టు తెలుస్తోంది.
హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డుపై మరో ఘోర రోడ్డు ప్రమాదం
శామీర్ పేట్ వద్ద ఔటర్ రింగ్ రోడ్డుపై ఆగి ఉన్న కంటైనర్ లారీని వెనుక నుండి ఢీకొట్టిన డీసీఎం
ప్రమాదంలో డీసీఎంలో ఉన్న ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా, తీవ్ర గాయాలపాలైన మరో వ్యక్తిని బయటికి తీసిన పోలీసులు pic.twitter.com/L1cqA32lBU
— Telugu Scribe (@TeluguScribe) May 25, 2026