ముంబై: ఆన్లైన్ బెట్టింగ్ యాప్ ‘మహదేవ్’ నిర్వాహకుల్లో ఒకరైన సౌరభ్ చంద్రకర్ దుబాయ్‌లో పట్టుబడ్డారు. ఆయనను గృహ నిర్బంధంలో ఉంచారు. దీంతో అతడిని భారత్‌కు రప్పించేందుకు దర్యాప్తు సంస్థలు ప్రయత్నాలు ప్రారంభించాయి. ఈడీ విజ్ఞప్తి మేరకు ఇంటర్‌పోల్ రెడ్ నోటీస్ జారీ చేయడంతో మహదేవ్ యాప్ మరో ప్రమోటర్ రవి ఉప్పల్ దుబాయ్ పోలీసులు ఇటీవల పట్టుకున్నారు. అతనిచ్చిన సమాచారం మేరకు చంద్రకర్‌ను కూడా అదుపులోకి తీసుకున్నారు.