ఆదివారం 24 మే 2020
National - Mar 15, 2020 , 09:57:29

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా

అమరావతి : కరోనా ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా పడ్డాయి. స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ ఆరు వారాల పాటు వాయిదా వేస్తున్నట్లు ఆ రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ రమేష్‌కుమార్‌ తెలిపారు. ఎన్నికల ప్రక్రియ వాయిదా మాత్రమేనని రద్దు కాదని ఆయన స్పష్టం చేశారు. ఇప్పటివరకు జరిగిన ప్రక్రియ రద్దు కాదన్నారు. ఏకగ్రీవంగా ఎన్నికైన వారు కొనసాగుతారన్నారు. ఎన్నికల్లో గెలిచిన వారితో కలిసి వారు బాధ్యతలు స్వీకరిస్తారని తెలిపారు. దేశవ్యాప్తంగా కరోనా వైరస్‌ ప్రభావం నేపథ్యంలో ఎన్నికలు వాయిదా పడ్డట్లు చెప్పారు. ప్రజారోగ్యం దృష్ట్యా ఎన్నికలు వాయిదా వేస్తున్నామని.. అత్యున్నతస్థాయి సమీక్ష తర్వాతే వాయిదా నిర్ణయం తీసుకున్నట్లు ఈసీ పేర్కొన్నారు. ఇప్పటివరకు జరిగిన ఎన్నికల ప్రక్రియ యధావిధిగా కొనసాగుతుందన్నారు. ఇప్పటికే కరోనాను జాతీయ విపత్తుగా కేంద్రం ప్రకటించిన విషయం తెలిసిందే.


logo