ప్రయాగ్‌రాజ్, జనవరి 30: యూపీలోని ప్రయాగ్‌రాజ్‌లో బుధవారం జరిగిన తొక్కిసలాట విషాదం మరువక ముందే మరో ప్రమాదం చోటుచేసుకుంది. మహాకుంభ్ ప్రాంతంలోని సెక్టార్ 22లో ఝున్సీ ఛత్నాగ్ ఘాట్, నాగేశ్వర్ ఘటాల్ సమీపంలో గురువారం అగ్నిప్రమాదం జరిగింది. 12 టెంట్లు దగ్ధమయ్యాయి. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని అధికారులు తెలిపారు. 11 రోజుల క్రితం కూడా ఇదేవిధంగా గ్యాస్ సిలిండర్ పేలి మంటలంటుకోవడంతో 18 టెంట్లు దగ్ధమైన విషయం తెలిసిందే.
మహా కుంభమేళాలో జరుగుతున్న ప్రమాదాలపై ప్రభుత్వం అప్రమత్తమైంది. బుధవారం జరిగిన తొక్కిసలాటలో 30 మంది మరణించగా, 60 మంది గాయపడ్డారు. దీంతో వాహనాల ప్రవేశాన్ని నిషేధించారు. వీవీఐపీ సహా ప్రత్యేక పాస్‌ల జారీని తొలగించారు.