‘నోస్’లో మరోసారి భారీ పేలుడు
మండలంలోని వెల్మినేడు శివారులోని నోస్ కంపెనీలో మరోసారి భారీ పేలుడు సంభవించి 8 మందికి గాయాలు కాగా ఒకరు మృతి చెందారు. 20 రోజుల్లో ఇది రెండో ఘటన కావడంతో కంపెనీలోని కార్మికులు, సమీప ప్రజలు భయాందోళనకు గురయ్యారు.
- ఒకరు మృతి, ఏడుగురికి గాయాలు
చిట్యాల, మే 1 : మండలంలోని వెల్మినేడు శివారులోని నోస్ కంపెనీలో మరోసారి భారీ పేలుడు సంభవించి 8 మందికి గాయాలు కాగా ఒకరు మృతి చెందారు. 20 రోజుల్లో ఇది రెండో ఘటన కావడంతో కంపెనీలోని కార్మికులు, సమీప ప్రజలు భయాందోళనకు గురయ్యారు. కంపెనీ సిబ్బంది, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. నోస్ కంపెనీలో శుక్రవారం మధ్యాహ్నం భారీ పేలుడు సంభవించింది. 3వ బ్లాక్‌లో రియాక్టర్ పేలి పొగలు కమ్ముకున్నాయి. ఆ బ్లాక్‌లో 9 మంది సిబ్బంది డ్యూటీలో ఉన్నారు. ఈ ఘటనలో వారందరికీ గాయాలుకాగా .. చిన్నకాపర్తికి చెందిన బొడ్డు బాలకృష్ణ (30) పరిస్థితి విషమంగా ఉండటంతో హైదరాబాద్‌లోని డీఆర్డీఏ అపోలో దవాఖానకు తరలించగా చికిత్స పొందుతూ మృతిచెందాడు.
గాయపడినవారిలో శివప్రసాద్, శంకర్, లోకేశ్, లింగస్వామి, డేవిడ్ ఉన్నారు. డేవిడ్ జార్ఖండ్‌కు చెందిన వ్యక్తి కాగా మిగిలిన వారు తెలంగాణకు చెందినవారు. ఘటనాస్థలాన్ని కలెక్టర్ చంద్రశేఖర్, ఎస్పీ శరత్‌చంద్రపవార్ సందర్శించారు. ఘటనకు సంబంధించిన వివరాలను తెలుసుకుని, విచారణకు ఆదేశించారు. విచారణ పూర్తి అయ్యేవరకు కంపెనీలో ఉత్పత్తి నిలిపివేయాలని సూచించారు. కంపెనీలో వరుస ఘటనలపై స్థానికులు ఆందోళన చేపట్టారు. కంపెనీ యాజమాన్యంపై చర్యలు తీసుకొని ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని డిమాండ్ చేశారు. బాధితులకు పరిహారం అందజేసి ఆదుకోవాలని కోరారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

